105 ఏళ్ళ బామ్మ కరోనా ను జయించింది ..



కొవిడ్‌-19తో జరిపిన పోరాటంలో ఓ శతాధిక వృద్ధురాలు విజయం సాధించింది. ఆమె చికిత్సకు సహకరించడంతోనే ఇది సాధ్యమైందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. వ్యాధి సోకినా మనోనిబ్బరం ఉంటే బతికేయవచ్చని ఈమె నిరూపిస్తున్నదని వారు చెబుతున్నారు.

కేరళలోని కొల్లాం జిల్లాకేంద్రానికి పక్కనే ఉన్న అంచల్‌ పట్టణానికి చెందిన అస్మాబీవీకి 105 ఏళ్లు. ఆమెకు కూతురు ద్వారా కరోనా సోకింది. దీంతో ఆమెను ఏపిల్ర్‌ 20న కొల్లాం మెడికల్‌ కళాశాల దవాఖానలో చేర్చారు. ఆమె ఇతర వ్యాధులతోనూ బాధపడుతున్నారు. కానీ, చికిత్సకు చక్కగా సహకరించడంతో మూడు నెలల్లో మహమ్మారి నుంచి కోలుకున్నది. ఆమె చికిత్సను వైద్యబోర్డు పర్యవేక్షించింది.

దీంతో బుధవారం ఆమెను దవాఖాననుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా, కరోనాతో కోలుకున్న రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వయస్కురాలు అస్మాబీవీనేనని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంత పెద్ద వయస్సులోనూ చికిత్స సహకరించిన ఆమెను ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ అభినందించారు.