మినరల్ వాటర్ తాగడం వలన కలిగే అనర్ధాలు ..



ఈ మధ్య కాలంలో పట్టణాలు , నగరాల్లోనే కాకుండా ప్రతి పల్లెల్లో కూడా ప్రజలు మినరల్ వాటర్ ను మాత్రమే తాగుతున్నారు ..ఒకప్పుడు అంటే కుళాయిలు , బోరింగులు , బావులు ఉండటం వలన మినరల్ వాటర్ అంతగా తాగే వారు కాదు ..కానీ టెక్నాలజీ పెరగడం తో పాటు పాతవి కనుమరుగు అవుతుండటంతో ప్రజలు ఎక్కువగా మినరల్ వాటర్ తాగడానికే అలవాటు పడుతున్నారు ..

మినరల్ వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ వాటర్‌లో మినరల్స్ ఉండవు సరికదా.. వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

మినరల్ వాటర్ తాగితే వచ్చే సమస్యల్లో ఒకటే మోకాలి నొప్పులు. నీటిని తాగడం వల్ల తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయట. మరీ ముఖ్యంగా.. ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్‌లో ఉండవు..

మామూలు ఏ మంచినీరైనా సరే దానిని కాచి చల్లార్చి రాగి పాత్రల్లో కానీ, కుండలో పోసి ఆ నీరు తాగితే మంచిదని చెబుతున్నారు.. ఇక కుండనీరు తాగితతే.. బెనిఫిట్స్ ఏంటంటే.. ఎముకలకి అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందన్నారు.. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకల్లో బలహీనంగా మారుతాయని చెబుతున్నారు.అదే విధంగా.. చాలా మంది నీరు ఎక్కువగా తాగరు.. దీని వల్ల భవిష్యత్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలోని అన్నీ జీవిక్రియలకు నీరే ఆధారం.అయితే మినరల్ వాటర్ కంటే మాములు వాటర్ తాగితేనే ప్రయోజనాలు అని నిపుణులు చెబుతున్నారు ..