Health bulletin: తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదు...!

తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈరోజు తెలిపిన బులిటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,261కి చేరింది. ఇందులో 7,661 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,66,120 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక కరోనా తో గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1480కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు చూస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 26, జీహెచ్ఎంసీ 123, జగిత్యాల 17, జనగాం 09, జయశంకర్ భూపాలపల్లి 10, గద్వాల్ 0, కామారెడ్డి 11, కరీంనగర్ 37, ఖమ్మం 32, ఆసిఫాబాద్ 8,

మహబూబ్ నగర్ 17, మహబూబాబాద్ 16, మంచిర్యాల 27, మెదక్ 12, మేడ్చల్ 58, ములుగు 14, నాగర్ కర్నూల్ 10, నల్గొండ 31, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 18, పెద్దపల్లి 24, రాజన్న సిరిసిల్ల 9,

రంగారెడ్డి 51, సంగారెడ్డి 32, సిద్ధిపేట 18, సూర్యాపేట 21, వికారాబాద్ 9, వనపర్తి 2, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 47, యదాద్రి భువనగిరిలో 14 కేసులు నమోదయ్యాయి.