ఆ ఆకు తొడిమను మాత్రం అస్సలు తినకండి...తింటే సంతానం కలగకపోవొచ్చు...!

తమలపాకు మనకు కేవలం తాంబూలంగా మాత్రమే తెలుసు. కానీ ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటి వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. శతాబ్దాలుగా దీనికి ఔషధమొక్కగా గుర్తింపు ఉంది.

చాలా మంది రకరకాల తలనొప్పులతో ఇబ్బందులుపడుతుంటారు. మీరు కాస్త లేతగా ఉండే తమలపాకులను కాసేపు నుదుటిపై పెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీ తలనొప్పి తగ్గిపోతుంది.

ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచు వున్నాయి. జలుబు, దగ్గును పోగొట్టే గుణాలు ఇందులో పుష్కలంగా వున్నాయి.

అయితే తమలపాకు తొడిమను మాత్రం అస్సలు తినకండి. తింటే సంతానం కలగకపోవొచ్చు. మోకాలి నొప్పులు దూరం కావాలంటే తమలపాకుల రసం తాగుతూ ఉండండి.

ఉదర సంబంధిత రుగ్మతలను తమలపాకు తొలగిస్తుంది. మూడు గ్లాసుల నీటిలో 15 తమలపాకులను వేసి, నీరు సగం అయ్యేవరకూ బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి, తేనె కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.

ముక్కు నుండి రక్తం కారడం, కళ్లు ఎరుపెక్కడం, అధిక రక్తస్రావం తదితర సమస్యలకు ఇది మందుగా పనిచేస్తుంది. స్వరం పీలగా ఉన్నవారు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి.

రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అది తిన్న వెంటనే చల్లనీళ్లు తాగాలి. తమలపాకు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్లను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది.

ఎముకలు గట్టి పడేందుకు కావాల్సిన కాల్షియం వీటిలో పుష్కలంగా ఉంటాయి. తమలపాకు రసం, నీరు, పాలు సమంగా కలుపుకుని తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. ఆవనూనెలో తమలపాకును వేసి వేడి చేసి ఛాతిపై రాస్తే జలుబు మాయమవుతుంది.

నోటి దుర్వాసన తొలగించడానికి రెండు గ్లాసుల నీటిలో ఐదు తమలపాకులను వేసి, గ్లాస్‌ అయ్యే వరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని మధ్యాహ్నం తాగాలి. అంతేకాదు తమలపాకును నమలడం ద్వారా నోటిపూత కూడా తొలగిపోతుంది.

ఇంకా దంత చిగుళ్లకు మేలు చేస్తుంది. కానీ తమలపాకును మితంగా తీసుకోవడం ద్వారా వీర్యవృద్ధి కలుగుతుంది. ఫంగస్ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకుకు ఉంటుంది. త్వరగా వృద్ధాప్యపు చాయలు కనిపించకుండా ఉండాలంటే తమలపాకులు తింటూ ఉండండి.

అది ఫంగస్ రాకుండా చేయగలదు. చుండ్రు ఎక్కువగా ఉంటే తమలపాకులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్నితలకు పట్టించి తర్వాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది.