ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మరసం, పసుపు


ఆరోగ్యాంగా ఉండడానికి అందరూ ఎన్నో చిట్కాలు చేబుతుంటారు. వాటిలో యిప్పుడు చెప్పే చిట్కా ఎంతో ఉపయోగమైనది. నిమ్మరసం, పసుపు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలుపుకుని తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


* జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది.

* కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమం సేవిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ సీజన్‌లో ఎదురయ్యే శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

* చర్మం సంరక్షింపబడుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ సీజన్‌లో చర్మం పగలకుండా ఉంటుంది.

* నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.