బీన్స్‌తో ఆరోగ్య సమస్యలు మన దరిచేరవు


మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీనాలి. అప్పుడే ఆరోగ్య సమస్యలు మన దరిచేరవు. వాటిలో బీన్స్‌ ఒకటి. బీన్స్‌లో కొలస్ట్రాల్‌ను తగ్గించే శక్తి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

ఒక కప్పు బీన్స్‌ను ఉడికించి తీసుకుంటే పదిశాతం కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. ఇది చాలా మందిపై పరిశోధన చేసి నిపుణులు చెప్పిన విషయం.

వారంలో నాలుగు రోజులపాటు మనం తీసుకునే ఆహారంలో బీన్స్‌ ఉంటే గుండె నొప్పి వంటి సమస్యలు దాదాపు 70శాతం వరకూ తగ్గుతాయి. బీన్స్‌లో ఉండే అద్భుత పోషకాలే ఇందుకు కారణం.

అధిక బరువు కలిగి బరువు తగ్గాలనుకునే వారికి బీన్స్‌ అద్భుత ఫలితాలనిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.


బీన్స్‌లో ఐరన్‌, మినరల్స్‌, మిటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఐరన్‌ లోపం తగ్గుతుంది.

బీన్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. బీపీ సమస్య కూడా ఉండదు.

బీన్స్‌తో మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

అన్ని సీజన్‌లలో బీన్స్‌ అందుబాటులో ఉంటాయి కాబట్టి వారంలో నాలుగు సార్లు బీన్స్‌ తిని అరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.