* జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది
* భోజనం తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది.
* బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా
తగ్గిపోతుంది.
* బెల్లంలో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున
బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు
బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.
* భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం.
అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.
* బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని
క్రమబద్దీకరణ చేస్తుంది.
* ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని
సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే
గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి
చేయాలి.
* చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి
చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలని నివారిస్తుంది.
* బెల్లం యొక్క గుణం వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి
ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని
కలిపి సేవించవచ్చు.
* శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం
సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్
కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని
తినేయండి.
* బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని
ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.
* మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి, బెల్లం
ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
* బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట
హయిగా వస్తాయి.
* బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డు చేసుకోని తింటే
చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.
* శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి
రూపంలో చేసుకుని తినేయండి.
* బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి
పూర్తిగా తగ్గిపోతుంది
* ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలుగా చేసి
తీసుకొంటే జాండిస్ పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది.
* బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె
(మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.