ఎండు కొబ్బరి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు



ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి. అందు కోసమే అనేక రకాలుగా ఎండుకొబ్బరిని వినియోగిస్తారు. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే... అందులోని ఫైబర్ వల్ల... గుండె కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పురుషులు రోజూ 38 గ్రాములు, మహిళలు రోజూ 25 గ్రాములు తినాలి. అయితే ఎండు కొబ్బరి వలన ఉపయోగాలు తెల్సుకుందాం

1. రోజూ ఎండుకొబ్బరి తింటే... ఓ వారం తర్వాత మంచి మార్పు కనిపిస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.

2. మతిమరపు సమస్యలు దూరమవుతాయి. ఎండుకొబ్బరి రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

3. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఇందుకు కారణం డ్రై కోకోనట్‌లోని సెలీనియమే.

4. కాన్సర్ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. కానీ... రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ రావట్లేదు. ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే... ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచే స్తుంది.

5. కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉంటే...ఎండుకొబ్బరి సరైన పరిష్కార మార్గం.

6. మలబద్ధకం, అల్సర్ వంటి పొట్ట సంబంధిత సమస్యలు ఏవి ఉన్నా సరే... రోజూ చిన్న ముక్క ఎండుకొబ్బరి తినేయాలి. కచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది.