ఉదయాన్నే వేడి నీరు తాగడం వలన ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ...



కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజలు తీవ్ర సతమతమవుతున్నారు ...హాస్పిటళ్లలో బెడ్స్ ఖాళీ లేవు అని , ఆక్సిజన్ లేదు అని వస్తున్న వార్తలతో బెంబేలెత్తిపోతున్నారు ..అందుకే కరోనా వచ్చాక ఇబ్బందులు పడటం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఇపుడు ఉన్న ఉత్తమమైన మార్గం ..అయితే కరోనా రాకుండా ఉండాలంట చాల మంది వేడి నీళ్లను లేదా గోరు వెచ్చని నీళ్లను తాగాలని చెబుతున్నారు ..అసలు వేడి నీళ్లు తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే ఈ కరోనా రావడం వలన వేడి నీటి యొక్క ఉపయోగం ఇపుడు అందరికి తెలుస్తుంది ..ఇప్పుడు ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం వళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ..

1. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగేవారిలో... జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం, పైల్స్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

2. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి, త్వరగా బరువు తగ్గుతారు.

3. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర అవాయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జీవ ప్రక్రియలన్నీ సజావుగా సాగుతాయి.

4. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వేడినీరు తాగడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

5. వేడినీరు తాగడం వల్ల 'కేంద్ర నాడీ వ్యవస్థ' పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది.

6. అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూను తేనె, సగం నిమ్మ రసం కలిపి రోజూ... పరగడపునే తాగడం వల్ల మలబద్ధకం ,హైపర్ ఎసిడిటీకి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది.