తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం చోటు చేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య చేసుకుంది.
చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చిత్ర బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి ఆమె ఈవీపీ ఫిల్మ్‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్లో పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. హ
హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.