RRR Movie Updates: రామ్ చరణ్ కాలికి మళ్లీ గాయమైందా..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాలికి మళ్లీ గాయమైందా..! ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఫొటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆ ఫొటొల్లో సంప్రదాయ దుస్తుల్లో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ అదరగొట్టేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి అభిమానులైతే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా ఈ ఫొటోలలో తన ఎడమకాలికి బ్యాండ్‌ వేసుకొని కనిపించారు రామ్ చరణ్‌.

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ మొదలైన రోజుల్లోనే రామ్ చరణ్‌ ఎడమ కాలికి గాయం అయ్యింది. దీంతో అప్పట్లో షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి కూడా చిన్న ఇంజ్యూరీ అవ్వడంతో.. సినిమా షూటింగ్‌ని కొన్ని రోజులు ఆపేశారు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఎడమ కాలికి బ్యాండ్ ఉండటంతో ఆ గాయం తాలుకు పెయిన్ ఇంకా ఈ హీరోకు ఉందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.