నందమూరి ఇంట్లో పెళ్లి సందడి... హాజరైన కల్యాణ్ రామ్,చంద్రబాబు...!

రీసెంట్ గా మెగా ఫ్యామిలీ లో మెగా పెళ్లి సందడి జరుగగా..ఇక ఇప్పుడు నందమూరి ఇంట్లో పెళ్లి సందడి పూర్తి అయ్యింది. నందమూరి చైతన్య కృష్ణ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

రేఖారాణి అనే ఆమెను చైతన్య పెళ్లి చేసుకున్నాడు. దం అనే ఒక సినిమాతో ఈయన జగపతిబాబుతో కలిసి నటించాడు.

కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడం తో మరో ఛాన్స్ రాకుండా పోయింది. దీంతో ఆయన ఒకే ఒక సినిమాకే పరిమితమయ్యాడు.

ఇక ఈ వివాహ వేడుకకు కళ్యాణ్ రామ్, బాలయ్య రెండో అల్లుడు శ్రీ భరత్ దంపతులు, చంద్రబాబు అలానే బంధు మిత్రులు హాజరు అయ్యారు