నిహారిక వివాహం.. పవన్ రాకతో మెగా ఫ్యామిలీ లో అసలైన సంబరాలు మొదలయ్యాయి...!

ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో టాలీవుడ్ నటి నిహారిక వివాహం ఘనంగా నిర్వహించేందుకు శుభ ముహూర్తం పెద్దలు నిశ్చయించారు.

ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మెగా హీరోలు, కుటుంబసభ్యులు ఒకేచోట కనిపించడంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మెగా డాటర్, టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.

అయితే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలతో మమైకమే ఉన్నారు. కానీ కుటుంబానికి సైతం సమయం కేటాయించాలి కదా.. అందుకే లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా నిహారిక వివాహ వేడుకలలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. మెగా బ్రదర్స్ కలిశారు.. అసలైన సంబరాలు ఇప్పుడు మొదలయ్యాయి అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు.

మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిహారిక, చైతన్యల వివాహ వేడుకతో మరోసారి మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణ కనిపిస్తోంది.