బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్గా హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, జయలలిత జీవితంలో కీలక వ్యక్తి అయిన ఎంజీఆర్ పాత్రని అరవింద్ స్వామి పోషిస్తుండగా, ఈ రోజు ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆయన లుక్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మక్కల్ తిలగమ్గా తమిళ ప్రజలచే పిలవబడ్డ ఎం.జి.ఆర్ తమిళ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఎంజీఆర్ మరణానంతరం ఆయన రాజకీయ వారసురాలిగా ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఈ మూవీలో కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు