మా మనోభావాలు దెబ్బతీయోద్దు...భీమ్ టీజర్ పై స్పందించిన ఆదివాసీ యువసేన


దర్శక ధీరుడు రాజమౌళి , స్టార్ నటులు రామ్ చరణ్ , ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్..టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు..అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ టీజర్ ఇంతకుముందే మొదలవ్వగా , దసరా కానుకగా ఎన్టీఆర్ టీజర్ కూడా రిలీజ్ అయింది..ఇందులో ఎన్టీఆర్ భీం పాత్రలో నటిస్తున్నాడు..

అయితే తారక్‌కు ఇందులో ముస్లిం టోపీ పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు..ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కొమురం భీం విగ్రహానికి ఆదివాసీల యువసేన ఇవాళ(శనివారం) క్షీరాభిషేకం చేశారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీజర్‌లో ఎన్టీఆర్‌కు ముస్లిం టోపి పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీం అని, ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలంటూ రాజమౌళికి సూచించారు.

ఇష్టారీతిగా సినిమా తీసి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీయోద్దంటూ రాజమౌళిపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో ముస్లిం టోపి ఉన్న కొమురం భీం సన్నివేశాలను తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆదివాసీలు హెచ్చరించారు. కాగా, బాహుబలి సినిమా అప్పుడు కూడా పలు వివాదాలు చెలరేగాయి. గిరిజనులను అవమానకరంగా చూపారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి.