ఒక్కో లగ్జరీ మాస్క్ ఖరీదు 9,600 డాలర్లు...!

కరోనా వైరస్‌ని ఎదుర్కునేందుకు మాస్కులు ధరించడం తప్పనిసరి కావడంతో ఫ్యాషన్ ప్రపంచంలో మాస్కులకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. అత్యంత ఖరీదైన మాస్కులు ధరిస్తూ మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు పోతున్నారు.

విలువైన ఆభరణాలకంటే రోజూ ధరించే మాస్క్‌నే మరింత ఆకర్షణీయంగా తయారు చేయాలని జపాన్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా లగ్జరీ మాస్క్‌ని తయారు చేసి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.

ముత్యాలు పొదిగిన మాస్కులు మురిపిస్తున్నాయి. చేతితో తయారు చేసిన మిలియన్ డాలర్లు ఖరీదు చేసే మాస్క్‌లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఒక్కో లగ్జరీ మాస్క్ ఖరీదు (9,600 డాలర్లు) ఒక మిలియన్ యాన్ ధర ఉంటుందని తయారీ దారులు వివరించారు.

గతవారం నుంచే Cox Co's Mask. com అనే కంపెనీ ముత్యాలు, వజ్రాల మాస్క్‌ల సేల్ ప్రారంభించింది. కరోనా మహమ్మారితో కుదేలైన ఫ్యాషన్ రంగం మళ్లీ ఊపందుకునేలా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.

వజ్రాల మాస్క్‌లను 0.7 క్యారెట్ డైమండ్, 300 Swarovski crystal, 330 జపనీస్ Akoya pearls నుంచి కొన్ని మాస్క్‌లను ముత్యాలతో అలకరించారు. కరోనా సంక్షోభంతో జ్యుయెలరీ, ఫాబ్రిక్ పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.

జపాన్‌లో ఈ పరిశ్రమలపై కరోనా అధిక ప్రభావం పడింది. జపాన్ మునపటిలా ఫ్యాషన్ రంగంలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని కంపెనీ యజమాని Azusa Kajitaka వెల్లడించారు.

రిటైలింగ్ గ్రూపు Aeon Co కంపెనీ Cox గత సెప్టెంబర్ నెలలోనే Mask.com ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ ద్వారా 500 Yen ప్రారంభ ధర నుంచి వజ్రాలు, ముత్యాలతో అలంకరించిన 200 రకాల లగ్జరీ స్టయిల్ మాస్క్‌లను విక్రయిస్తోంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాస్క్‌లుగా ఈ జపనీస్ లగ్జరీ స్టయిల్ మాస్క్‌లకు భారీ గిరాకీ ఉంది. 18 క్యారెట్ల బంగారంతో 250 గ్రాముల బరువైన మాస్క్‌లను ఇజ్రాయెల్ జ్యుయెలరీ Yvel కంపెనీ 1.5 మిలియన్ డాలర్ల (ఒక డాలర్‌కు 104.4900 Yen) మాస్క్ లను తయారు చేసింది. ఇప్పుడు జపాన్ లో ఈ లగ్జరీ మాస్క్ లను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.