చుండ్రు సమస్య తగ్గాలి అంటే ఈ చిట్కాలు పాటించండి


చాలామంది ఆడవారు గాని , మగవారు గాని ఎక్కువగా చుండ్రు సమస్యని ఎదుర్కొంటారు. అలాంటివారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్య తగ్గుతుంది. అదేంటో చూడండి..

1. వారంలో 3సార్లు తప్పనిసరిగా తలస్నానం చేస్తుండాలి..తల స్నానం చేయడం వల్ల బయటకు తిరిగి వచ్చినప్పుడు నెత్తికి పట్టుకున్న మురికి మొత్తం పోతుంది ..

2. ఖచ్చితంగా మనం వాడే టవల్స్, దువ్వెనలను ఎప్పటికప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి..

3. పెరుగు, నిమ్మరసంలు కలిపి తలకు రాసి ఆరాక నీటితో కడగాలి. ఇలా వారంలో 2 సార్లు చేయండి.

4. మెంతులను మజ్జిగలో 4గంటల పాటు నానబెట్టి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు రాసి అరగంట తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల చుండ్ర తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

5. కోడిగుడ్డు తెల్లసొనని రెండు చెంచాల నీళ్లు కలిపి బాగా బీట్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు రాయాలి.. ఆరాక గోరువెచ్చని నీటితో కడగాలి..

6.ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే తప్పకుండా మీరే తేడాను గమనిస్తారు.