కలలో పండ్లు వస్తే ..జరిగే పరిణామాలు ..

మనం నిద్రపోయినప్పుడు రకాల రకాల కలలు రావడం సహజం ..అయితే మనకు వచ్చే కలలకు అర్ధాలు ఉన్నాయి అని జోతిస్యులు చెబుతుంటారు ..కొన్ని కలల్లో పండ్లు, వస్తువులు కనిపిస్తుంటాయి. ఐతే ఏ పండ్లు కనిపిస్తే ఎలాంటి ఫలితమో చూద్దాం.

1. దోసపండు కలలో కనిపించిన ఆహ్లాదముగా, ఆనందముగా గడపగలరు. తిన్నట్లు కలవచ్చిన సజ్జన సాంగత్యము కలుగుతుంది.అంటే మంచి వ్యక్తులతో స్నేహం చేస్తారు ..

2. బత్తాయి పండ్లు గంపనిండా కలలో చూసిన మీ ఆప్తమిత్రులు మిమ్ములను అకారణంగా ద్వేషిస్తారు.

3. పుచ్చకాయ కలలో కనిపించిన ప్రయత్నము చేయు పనులలో విజయం సాధించగలరు.

4. తాడిపండును కాల్చినట్లు కలవచ్చిన రాబడి పెరుగుతుంది.

5.కలలో ద్రాక్ష పండ్లు తింటున్నట్లు వస్తే అది శుభ సంకేతంగా పరిగణించవచ్చు. దీనర్థం త్వరలోనే ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకోవచ్చు.

6. కలలో మీరు దానిమ్మపండు తింటున్నట్లు కనిపిస్తే ఇది లాభదాయకంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరు డబ్బు పొందబోతున్నారనడానికి ఇది ఒక సంకేతం.

7. పైనాపిల్ తింటున్నట్లు కల వస్తే అది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. దీని అర్థం ఒక పని కోసం మీరు ప్రారంభంలో కష్టపడాల్సి ఉంటుంది. అయితే అనంతరం మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు.

8. కలలో మీకు జామపండు తింటున్నట్లు లేదా తోట నుంచి జామ పండు తింటున్నట్లు వస్తే అది మీకు శుభ సంకేతంగా పరిగణిస్తారు. దీనర్థం ఇప్పటివరకు మీ జీవితంలో వచ్చిన సమస్యలు ముగియబోతున్నాయని తెలుసకోవచ్చు