గణనాధుడు కలలో వస్తే మంచిదా ..కాదా ?



నిద్రలో వచ్చే కలలు మన నియంత్రణంలో ఉండేవి కావు. అవి మన గతం లేదా భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలుగా జనులు విశ్వసిస్తుంటారు. అయితే వీటిలో కొన్ని శుభం లేదా అశుభానికి చెందిన కలలుగా విభజించవచ్చు. ఈ నేపథ్యంలో స్వప్నంలో వినాయకుడు కలలోకి వస్తే ఏమవుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం.

గణేశుడు కలలోకి రావడమంటే అది ఎంతో శుభ పరిణామంగా పరిగణించాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడంటేనే విఘ్నాలను హరించేవాడని అర్థం. అంటే జీవితంలో వచ్చే అవరోధాలను అడ్డుకుని సాంత్వన కలిగిస్తాడని నమ్ముతారు. అందుకే ఏ పని ప్రారంభించేముందైన గణేశుడిని పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తే అందులో సమస్యలేమైనా ఎదురైనా తొలుగుతాయి. అంతేకాకుండా శుభం కలిగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దేవతలందరికంటే ముందు ఆది పూజ విఘ్నేశ్వరుడికే చేయాలి.

వినాయకుడు శుభానికి ప్రతిరూపం. అంతేకాకుండా ఎంతో మంచి చేస్తాడని నమ్మకం. కలలో గణనాథుడు వస్తే ఆయను అనుగ్రహం పొందినట్లేనని సూచన. వినాయకుడిని సుఖార్త అని కూడా అంటారు. అంటే మంచి చేసేవాడు లేదా సుఖ-సంతోషాలను కలిగించేవాడని అర్థం. కాబట్టి ఆయన గురించి కలలు కన్నప్పుడు త్వరలో శుభవార్తలు వినబోతున్నారని తద్వారా ఆనందం పొందవచ్చని తెలుసుకోవాలి.

కలలో గణేశుడు కనిపించాడంటే త్వరలో మీరు ఓ పనిని లేదా వ్యక్తిగత జీవితంలో నూతన ప్రారంభాన్ని ఆరంభించబోతున్నారని సూచిస్తుంది. అంతేకాకుండా గతంలో మీరైమైనా మొక్కులు మొక్కి తీర్చలేనప్పుడు వాటిని గుర్తు చేసేందుకు కూడా గణనాథుడు కలలో కనిపించవచ్చు. ఈ విధంగా కనిపించి ఆ మొక్కును ఆయన స్వరూపం ద్వారా గుర్తు చేసినట్లు అర్థం చేసుకోవాలి. దీనర్థం ఇచ్చిన వాగ్ధానాలు ప్రజలు ఎప్పటికీ మరువకూడదని సూచిస్తుంది