శ్రీకృష్ణ పురాణం: కురుక్షేత్ర యుద్ధం

మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కీలకమైన. హిందూ మత పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. కల్పితాలే కొన్ని సందర్భాల్లో నిజంగా జరిగినట్లే ఉంటాయి. ఇక రామాయణ, మహాభారతాల్లో వివరించిన ఆయుధాలు, సాంకేతి పరిఙ్ఞ‌ానం, నిర్మాణాలు ప్రస్తుతం ఆధునిక సైన్స్‌లో నిజంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడు తన తెలివైన వ్యూహాలతో కురుక్షేత్రంలో పాండవులు విజయానికి కారణమయ్యాడు.


సాక్షాత్తు నారాయణుడి అవతారమైన భగవానుడు ఈ భూమిపై ఎన్నేళ్లు జీవించాడో తెలుసా? అసలు భారత యుద్ధం జరిగేటప్పటికి కృష్ణుడి వయసు ఎంత? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. మత్స్య పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగేనాటికి శ్రీకృష్ణుడి వయసు 89 ఏళ్లు. మహాభారతంలోని మౌసల పర్వంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిన 39 ఏళ్ల తర్వాత కృష్ణుడు నిర్యాణం చేందాడని పేర్కొన్నారు. అంటే శ్రీకృష్ణుడు మానవ రూపంలో 125 ఏళ్లు జీవించాడు.


కృష్ణుడిని ఉద్దేశిస్తూ భగవద్గీతలో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవ దేవా, యదు వంశంలో జన్మించిన నీవు, 125 ఏళ్ల పాటు భూమిపై నీ భక్తులతో కలిసున్నావని తెలిపాడు. అంటే కృష్ణుడు 125 ఏళ్ల తర్వాత తన అవతారాన్ని చాలించాడని తెలుస్తోంది.

జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడికి చెందిన ఆసక్తికరమైన లీలలను భక్తులు కథలుగా చెప్పకుంటారు. విష్ణు పురాణం ప్రకారం 12 ఏళ్ల వయసులోనే తన మేనమామ కౌంసుడిని సంహరించాడు. అలాగే పదహారేళ్ల వయసులోనే గోకులంలో గోపికలతో రాసలీలలు జరిపినట్లు కొంత మంది పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ చారిత్రక పురాణాలు ఆధారంగా గుర్తించబడింది.