జూన్ 5 న చంద్ర గ్రహణం

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే గ్రహాల స్థితిగతుల ఆధారంగా భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేస్తుంటారు పండితులు. అందులోనూ గ్రహణం రోజు వీటి ప్రభావం మనుషులపై ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రగ్రహణం.. ఈ ఏడాది ఇప్పటికే ఓ సారి వచ్చింది. గత జనవరిలో తొలిసారి గ్రహణం ఏర్పడగా.. జూన్ 5న రెండో సారి చంద్రగ్రహణం రానుంది. పూర్తిగా వైవిధ్యంగా ఉండనున్న ఈ చంద్రగ్రహణం సాధారణంగా కనువిందు చేయనుంది. గ్రహణం సమయంలో చంద్రుడిని పూర్తిగా వీక్షించవచ్చు. అంతేకాకుండా మీ పనులు మీరు చూసుకుంటూనే పౌర్ణమి రోజు చంద్రుడిని పూర్తి స్థాయిలో వీక్షించవచ్చు. ఈ గ్రహణం వల్ల మతపరంగానూ ఎలాంటి నిషేధం ఉండట్లేదు. మరి జూన్ 5న ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

జ్యేష్ట మాసంలోని పూర్ణిమ రోజైన జూన్ 5న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు గ్రహణం అర్థరాత్రి 11.16 గంటలకు ప్రారంభమవుతంది. జూన్ 6న తెల్లవారు జామున 2.34 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఉన్నవారు వీక్షించవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడి ఆకారంలో ఎలాంటి హెచ్చుతగ్గుల సంభవించవు. ఆకారంలోనూ ఎలాంటి మార్పులు ఉండవు. అయితే గ్రహణం సమయంలో చంద్రుడు కాంతి కొంచెం క్షీణిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే ఓ సారి చంద్రగ్రహణం ఏర్పడింది. ఏడాది ప్రారంభంలోనే జనవరి 10న చంద్రగ్రహణం ఏర్పడింది.


చంద్రగ్రహణం ప్రారంభమవక ముందు చంద్రుడు భూమి ఉపఛాయలోకి అడుగుపెడతాడు. దీన్నే చంద్రమాలిన్యం అని అంటారు. ఆంగ్లంలో పెనుంబ్రాల్ అని పిలుస్తారు. అనంతరం భూమి వాస్తవిక ఛాయలో చంద్రుడు ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాస్తవికమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే చాలా సార్లు చంద్రుడు, భూమి ఉపఛాయలోకి ప్రవేశించిన వెంటనే ఆ నీడ నుంచి బయకు వస్తాడు. ఇలాంటి సందర్భాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అని అంటారు. ఈ సమయంలో చంద్రుడు పాక్షికంగా మాత్రమే దర్శనమిస్తాడు. ఫలితంగా చంద్రుడు నశించినట్లు అగుపిస్తాడు. దీన్నే ఉపఛాయ చంద్రగ్రహణం అని అంటారు.
శాస్త్రాల ప్రకారం వాస్తవిక చంద్రగ్రహణం కంటే ఉపఛాయ చంద్రగ్రహణం కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. ఈ గ్రహణం నియమాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ సమయంలో పూజలు నిషేధించరు. ఇది కాకుండా గ్రహణం చూడకూడదనే నియమం లేదు. అంతేకాకుండా ఆహారాన్ని తినవచ్చు. అంతేకాకుండా దైనందిన జీవితంలోనూ ఎలాంటి మార్పులు సంభవించవు. అంతేకాకుండా గ్రహణం సమయంలో విరాళం ఇవ్వాలనే నియమం కూడా దీనికి వర్తించదు.