కల్పవృక్ష వాహనంపై ఊరేగిన దేవదేవుడు...


శ్రీమన్నారాయణుడు ఏ అవతారమెత్తినా దానికో పరమార్థం ఉంటుంది. దుష్ట శిక్షణ., శిష్ట రక్షణ ఆయన ప్రథమ కర్తవ్యం కోరుకోవాలే కానీ కొండంత వరాలను గుప్పిస్తాడు.తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ కల్పవృక్ష వాహనంలో స్వామివారు దర్శనమిచ్చేది కూడా ఇందుకే కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షాన్ని మనం చెప్పుకుంటాం

.అసలు వృక్షమే కదా ప్రకృతిని రమణీయంగా చేసేది! వృక్షమే కదా సకల చరాచరజీవులు చల్లగా ఉండేందుకు కారణమయ్యేది! అలాంటి వృక్షాలలో మేటి కల్పవృక్షం. పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం వుంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించింది కల్పవృక్షం

కల్పవృక్షం నీడలో నిలుచుOటే ఆకలిదప్పులు వేయవట. కోరుకున్నదల్లా ఆ తరువు ప్రసాదిస్తుందట ఆ మహిమాన్విత కల్పవృక్షంపై ఏడుకొండలవాడు ఊరేగారు. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకు కొంగు బంగారమే కోరినంత వరాలను గుప్పించే దేవుడే ఇవాళ సాయంత్రం సర్వ భూపాల వాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు కనువిందుచేస్తారు.