Advertisement

ఓరుగల్లు అందాలు

By: chandrasekar Thu, 23 July 2020 6:52 PM

ఓరుగల్లు అందాలు


తెలంగాణ ప్రాంతాన్ని అనేక మంది పాలకులు పరిపాలించారు. ఆయా పాలకులు వారి అభిరుచి మేరకు వివిధ నిర్మాణాలు చేపట్టారు. అలాంటి వాటిలో వరంగల్‌ ఒకటి. వరంగల్ పురాతన కాలంలో ఓరుగల్లు లేదా ఒంటికొండగా పిలువబడేది. ఎందుకంటే ఈ ప్రాంతమంతా కేవలం ఒకే రాతిలో వుండటం వల్ల దీనికాపేరు వచ్చింది.

అంతేకాదు ఇది కాకతీయుల రాజ్యానికి రాజధానిగా వుండేది. అందుకు ఆధారంగా వారికి సంబంధించిన ఎన్నో శిధిలాలు వున్నాయి. వీటితోపాటు అక్కడ చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో వున్నాయి. వాటిలో ముఖ్యమైంది వరంగల్‌ కోట. అలాగే ఈ ప్రాంతంలో పాకాల సరస్సు, వేయి స్తంభాల గుడి, రాక్‌ గార్డెన్‌, ఇంకా తదితర పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.

వరంగల్‌ కోట: దక్షిణ బారతదేశ చరిత్రలో విశిష్టమైన నిర్మాణశైలిగా ఇది ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇది చాలా ప్రాచీనకాలం నాటికి చెందింది. ప్రస్తుతం కొంతమేర శిథిలమైనట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ కోట లోపల వున్న భాగాలు ఎంతో అందంగా దర్శనమిస్తుంటాయి.

beauties,orugallu,travel,place,temple ,ఓరుగల్లు అందాలు ,ప్రయాణం, స్థలం, ఆలయం


వేయి స్తంభాల గుడి: వరంగల్‌ లో చారిత్రాత్మక భూమిగా ప్రసిద్ధి చెందిందనడానికి ఈ గుడి సాక్షాత్తూ ఆధారంగా వుంటుంది. ఇందులో ప్రాచీన కాలానికి చెందిన కొన్ని ప్రత్యేకమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి. అలాగే విష్ణు, శివుడు, సూర్యభగవానుడు తదితర దేవుళ్ల విగ్రహాలు కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇస్తాయి. ఈ దేవాలయ శిల్పశైలి వర్ణనాతీతం. ఇక్కడ నిత్యం పర్యాటకుల సంచారం వుంటుంది.

beauties,orugallu,travel,place,temple ,ఓరుగల్లు అందాలు ,ప్రయాణం, స్థలం, ఆలయం


పద్మాక్షి టెంపుల్: 12వ శతాబ్దం నాటి కాలానికి చెందిన అతి పురాతనమైన ఆలయం. దీనిని అనకొండ స్థంబం అని కూడా అంటారు. దీని నిర్మాణం ఎంత అద్భుతంగా వుంటుందంటే చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపడక తప్పదు. ఈ స్థంబంపై అందమైన చెక్కడాలు, శాసనాలు కూడా వున్నాయి.

beauties,orugallu,travel,place,temple ,ఓరుగల్లు అందాలు ,ప్రయాణం, స్థలం, ఆలయం


భద్రకాళి టెంపుల్: వరంగల్‌ లో వున్న అతిపురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయానికి చుట్టూ ఆనాటి కాలానికి చెందిన వివిధ రాతి నిర్మాణాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ దేవాలయంలో వున్న భద్రకాళి మాత విగ్రహం చక్కని అలంకరణతో, వివిధ ఆయుధాలతో దర్శనం ఇస్తుంది.

Tags :
|
|

Advertisement