Advertisement

చెన్నైలో కొన్ని పర్యాటక ప్రదేశాలు

By: chandrasekar Fri, 21 Aug 2020 5:04 PM

చెన్నైలో కొన్ని పర్యాటక ప్రదేశాలు


* గిండీ జాతీయ పార్కు

తమిళనాడులో జంతు రక్షిత ప్రాంతంగా నిర్వహించబడుతున్న గిండీ జాతీయ పార్కు 2.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. నగర పరిధిలో ఉన్న కొన్ని జాతీయ ఉద్యానవనాలలో ఇది ఒకటి. దీనిని ఫోటోగ్రాఫర్ల స్వర్గధామం అని కూడా పిలుస్తారు. ఇది వందలాది కృష్ణ జింకలు, మచ్చల జింకలు, వివిధ రకాల నక్కలు, తాబేళ్లు, హైనాలు, ముళ్లపందులు, ముంగీసలు, పక్షులకు వంటి అనేక వన్యప్రాణులకు నివాసం. అందమైన సరస్సులు, ప్రవాహాలను చూస్తూ దట్టంగా పెరిగిన చెట్ల నీడలో నడవడం ఎంతో బాగుంటుంది. తెల్లవారుజాము సమయం ఈ పార్కు అన్వేషణకు ఉత్తమమైనది. ఈ ఉద్యానవనంలో కొన్ని నిషేధిత ప్రాంతాలు కూడా ఉన్నాయి.

guindy,national park,tourist,places,chennai ,చెన్నైలో,  కొన్ని,  పర్యాటక,  ప్రదేశాలు


* పాంథియోన్ అని పిలువబడే ​ప్రభుత్వ మ్యూజియం

పాంథియోన్ అని పిలువబడే బ్రిటిష్ కాలం నాటి భవనాల సముదాయంలో ఉన్న చెన్నై ప్రభుత్వ మ్యూజియం 6వ శతాబ్ధం నుండి సేకరించిన కళాఖండాల నిధి. ఇక్కడ ముఖ్యంగా హొయసలు, చాళుక్యులు, చోళులు, విజయనగర సామ్రాజ్య కాలం నాటి అద్భుతమైన కలెక్షన్ ఉంటుంది. ఇందులో సహజ చరిత్ర మరియు జంతుశాస్త్రానికి సంబంధించిన గ్యాలరీలు, కాంస్య శిల్పాలు కూడా ఉన్నాయి. 10 నుండి 18వ శతాబ్ధం వరకు ఉన్న మొఘల్, రాజస్థానీ, డెక్కన్ కళాకృతులను ప్రదర్శించే నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

guindy,national park,tourist,places,chennai ,చెన్నైలో,  కొన్ని,  పర్యాటక,  ప్రదేశాలు


* సాంస్కృతిక కేంద్రం ​దక్షిణచిత్ర

చోళమండల కళాకారుల గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ సాంస్కృతిక కేంద్రం తమిళనాడు మరియు పొరుగు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక యొక్క కళలు, హస్తకళలను ప్రదర్శిస్తుంది. ఇక్కడ సాంప్రదాయ గృహాలు మరియు వర్క్ షాప్ ల నమూనాలు, కుండలు మరియు నేత పనులు, ఇతర నైపుణ్యాలకు సంబంధించి వారంతాల్లో మంచి ప్రదర్శనలు ఉంటాయి. ఈ సాంస్కృతిక కేంద్రంలో దుకాణాలు స్థానిక ఉత్పత్తుల కలెక్షన్ ను అందిస్తాయి. వీటిలో కొండపల్లి నుంచి చెక్క బొమ్మలు, పులికాట్ నుండి తాటి ఆకు పెట్టెలు వంటి అనేక ఉత్పత్తులు ఉంటాయి.

Tags :
|
|

Advertisement