Advertisement

ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహార నగరం ఎక్కడ ఉందొ తెలుసా ..?

By: Sankar Sun, 19 July 2020 5:55 PM

ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహార నగరం ఎక్కడ ఉందొ తెలుసా ..?



మనుషుల్లో వెజిటేరియన్ తినే వారు , నాన్ వెజ్ తినే వారు అని ఉంటారు ..కానీ వెజ్ సిటీ కూడా ఉన్నదీ అని తెలుసా ..అయితే ఆ వెజ్ సిటీ మన దేశంలోనే ఉంది ..గుజరాత్‌లోని పలిటానా.. ప్రపంచంలోనే మొట్టమొదటి శాఖాహార నగరం. ఇక్కడ మాంసం, గుడ్లను చట్టవిరుద్ధం చేశారు. పర్వతంపై ఉన్న అతి తక్కువ నగరాల్లో ఇది ఒకటి. జంతు వధ, మాంసం తినడం, గుడ్లు అమ్మడం అన్నీ నిషేధించారు. జైన మతానికి సంబంధించిన తొమ్మిది వందల ఆలయాలు ఇక్కడ ఉన్నట్లు ఆధారాలున్నాయి.

జైనంలో శాంతి, అహింస వంటి విషయాలు ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. అందుకే వారు హింసను పూర్తిగా నిషేధించారు. అంతెందుకు వాళ్లు నడుస్తున్నప్పుడు కీటకాలు కనిపిస్తేనే.. వాటికి ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు కీటకాలు వెళ్లేంతవరకు ఆగుతారు. మాంసం, గుడ్ల వినియోగానికి జైన మతం వ్యతిరేకం అని బోధిస్తుంది. కానీ, జంతువుల నుంచి వచ్చే పాలను మాత్రం స్వీకరిస్తుంది.

ఈ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను పవిత్ర స్థలాలుగా భావించి మాంస రహిత మండలాలుగా ప్రకటించారు. 200 మంది జైన మత గురువులు 2014లో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఆ పట్టణాన్ని మాంస రహిత జోన్‌గా ప్రకటించకపోతే ప్రాణాలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని ఉద్యమం చేశారు.అయితే మాసం బందు చేసినప్పటికీ ఇప్పటికి అక్కడ పాలు , పాల ఉత్పత్తులు మాత్రం వాడుతున్నారు ...

Tags :
|
|
|

Advertisement