Advertisement

కొత్త జంట వెకేషన్ కు అద్భుతమైన ప్రదేశం మాల్దీవ్స్ ..

By: Sankar Tue, 02 June 2020 5:37 PM

కొత్త జంట వెకేషన్ కు అద్భుతమైన ప్రదేశం మాల్దీవ్స్ ..

లాక్ డౌన్ కారణంగా విదేశీ ప్రయాణాలకు బ్రేక్ పడింది కానీ లేకుంటే వేసవిలో అనేక జంటలు సమ్మర్ వెకేషన్ కోసం అనేక దేశాలు చుట్టి వచ్చేవాళ్ళు ..అయితే విదేశీ టూర్లలో ఎప్పుడు ఎక్కువగా వినిపించే పేరు మాల్దీవ్స్

సేలబ్రిటీలు తమకు నచ్చిన స్పాట్‌కి వెళ్లి సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌ కోసం ఓ పోస్ట్‌ని పెడుతున్నారు. దీనికి ఫిదా అయిన నెటిజన్లు మనం కూడా ఆ స్పాట్‌కి వెళ్తే ఎంతబాగుంటుందంటూ సిద్ధమవుతున్నారు. క్షణాల్లో గూగూల్‌ సెర్చ్‌ చేసేస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో ఇప్పుడు మాల్దీవులు క్రేజ్‌గా మారాయని చెప్పొచ్చు

maldives,vaccation,honymoon,new couple,beaches ,వేసవి, విదేశీ టూర్, మాల్దీవులు, నెటిజన్లు , విదేశీ ప్రయాణాల

మాల్దీవుల్లో ఉండే బీచ్‌లు సూపర్‌గా ఉంటాయి. ఎన్నిరోజులైనా ఉండాలనిపించే ప్రదేశం అది. ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ దొరుకుతుంది. అక్కడున్న వందల ఐలాండ్‌ల వద్ద రెస్టారెంట్లు, హోటల్స్‌ ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొత్తగా పెళ్‌లైన వాళ్లకి మంచి స్పాట్‌ ఇది..

మాల్దీవులకు వెళ్లాలంటే ఫ్లైట్‌ ఎక్కాల్సిందే. ఫ్లైట్‌ ధర ఇప్పటికిప్పుడు వెళ్లాలంటే ఫ్లైట్‌ ధర రూ.11 వేలు ఉంది. అదే వారం రోజుల తర్వాత అంటే రూ.7 వేలకే లభిస్తుంది. అంటే ఫ్లైట్‌లో వెళ్లి తిరిగి రావడానికి ఒక్కో మనిషికి అయ్యే ఖర్చు రూ.20 వేలు. అక్కడ మనం ఎంచుకునే హోటల్‌ని బట్టి ధరలు ఉంటాయి. సాధారణ హోటల్‌లో ఒక్క రాత్రి బసకు రూ.2 వేల చొప్పున చార్జ్‌ చేస్తుండగా..ఫైవ్‌స్టార్‌ వంటి హోటల్‌లో ఒక్క రాత్రికి రూ.5 వేలు, 7 వేలు చొప్పున చార్జ్‌ చేస్తున్నారు. ఇవి కాకుండా అక్కడ దరొకే ఫుడ్, మెనూ మనల్ని నోరూరిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన వంటకాలు మాల్దీవుల్లో లభించడం విశేషం. ఒక వ్యక్తి మాల్దీవులను నాలుగు రోజుల పాటు విజిట్‌ చేసి రావాలంటే కనీసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందని ట్రావెల్స్‌ ఏజెంట్లు చెబుతున్నారు.

Tags :

Advertisement