Advertisement

ఆకర్షణీయ విహార స్ధలం గోవా

By: chandrasekar Thu, 18 June 2020 8:00 PM

ఆకర్షణీయ విహార స్ధలం గోవా


ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. అక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే. ఈ ప్రాంతానికిగల విశ్వజనీనమైన ఆదరణ చాలామంది యువకులను మరియు పెద్దలను కూడా ఒకే రకంగా ఆకర్షించేదిగా ఉంటుంది. భారతదేశంలోని కోస్తాతీర నగరాలు, పట్టణాలలో ఉండే చక్కని వేసవి సెలవుల అనుభవాలు గోవాలో కూడా అమితంగా లభిస్తాయి.

గోవా పట్టణన్ని పరిశీలిస్తే, ముందుగా ప్రతి ఒక్కరూ గమనించేది ఈ ప్రదేశం పోర్చుగీసు జీవన విధానంతో ప్రధానంగా ప్రభావించబడిందని గుర్తిస్తారు. దీనికి కారణం పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని సుమారుగా అరవైల వరకు పాలించారు. ఇంతేకాక, గోవా ప్రజలు వారి సాంప్రదాయ వారసత్వానికి గర్వపడతారు. వారికిగల వారసత్వ భవనాలు, ఇతర మానవ నిర్మిత కట్టడాలు, సహజ సిద్ధ చిహ్నాలను పరిరక్షించుకుంటారు. ఈ పట్టణం ప్రపంచంలోని వివిధ దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది.

goa,fascinating,vacation,spot,travel ,ఆకర్షణీయ , విహార, స్ధలం, గోవా, పర్యాటకులను


గోవా ఇతర ప్రాఖ్దేశాలతో పోలిస్తే అధిక పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. మరి గోవాలో ఒక రోజు ఆనందంగా ఎలా గడపాలి? మొదటగా, మీరు ఉదయం వేళ రుచికరమైన అక్కడి సాంప్రదాయ మెడిటర్రేనియన్ లేదా కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ అక్కడి హోటళ్ళలో ఆరగించేయాలి. హోటళ్ళు సాధారణంగా ఉత్తర గోవా లేదా పాంజిం లలోని కండోలిం రోడ్లపై కనపడుతూనే ఉంటాయి. గోవాలో ప్రత్యేకత ఏమంటే? ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే ఒక బీర్ బాటిల్ సైతం పుచ్చుకోవడమనేది సర్వ సాధారణం. కండోలిం వీధులను కాలినడకన లేదా ఒక ద్విచక్రవాహనం అద్దెకు తీసుకోవడం ద్వారా చూడవచ్చు. ద్విచక్రవాహనం రోజుకు రూ.250 మించి సాధారణంగా ఉండదు. కనుక మీరు బ్రేక్ ఫాస్ట్ ప్రదేశం చేరేముందదే అతి చవక ధరలలో కొంత షాపింగ్ కూడా చేయవచ్చు. టి- షర్టులు, సన్ గ్లాసులు, రిఫ్రిజిరేటర్ మాగ్నెట్ లు, వంటివి కొనుగోలు చేయవచ్చు. ఇవి సాధారణంగా కండోలిం లేదా అంజునా ప్రదేశాలలో దొరుకుతాయి. శనివారాలు సెకండ్ హ్యాం డ్ వస్తువుల మార్కెట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సెలవు దినం అయిందంటే చాలు బీచ్ కు జనాలు అధికంగా వచ్చేస్తారు.

కండోలిం ప్రాంతంలోనే మూడు ప్రధాన బీచ్ లు ఉన్నాయి. అవి కండోలిం బీచ్, కాలాగుటే బీచ్ మరియు బాగా బీచ్ లు. వీటిలో బాగా బీచ్ బాగా మెయిన్టెయిన్ చేస్తారు. అన్ని బీచ్ లలోను వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. వీటిని కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కైస్, బనానా రైడ్, పారా సైలింగ్ వంటివి ఎంచుకోవచ్చు. బీచ్ లో కల గుడిసెలలో లభించే అచ్చమైన గోవా సీఫుడ్ తో బాటుగా బీర్ పుచ్చుకోవడం మరచిపోకండి. ఈ మూడు ప్రధాన బీచ్ లనుండి కొద్ది దూరంలోనే అంజునా బీచ్ ఉంటుంది. అంజునా బీచ్ ఎంతో ప్రశాంతంగా ఉండి, ఒక పుస్తకం చదువుకోవాలన్నా లేక మీ ఇ మెయిల్స్ చెక్ చేసుకోవాలన్నా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడి విశిష్టత నిశ్శబ్దం మరియు ప్రశాంతత. హుక్కా ప్రియులైతే, గోవాలోని బీచ్ లోని గుడిసెలు, ప్రత్యేకించి కొన్ని చోట్ల చాలా చౌకగా మీకు అందిస్తాయి.

goa,fascinating,vacation,spot,travel ,ఆకర్షణీయ , విహార, స్ధలం, గోవా, పర్యాటకులను


దక్షిణ భాగం పరిశీలిస్తే, ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన చర్చిలు మరియు అతి ప్రశాంతమైన బీచ్ లు ఉన్నాయి. గోవాలు ఎంతో పేరు మోసిన కోల్వా బీచ్ దక్షిణ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఎంతో ఖరీదైన హోటళ్ళు ఉండటంచే క్రమశిక్షణ ఆచరించేవారికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇక సాయంత్రం అయిందంటే చాలు, గోవా పట్టణం పార్టీ ప్రియులకు స్వర్గమే. ఈ పార్టీలు తెల్లవారి 3 గంటల వరకు జరుగుతాయి నైట్ క్లబ్ యజమానులు, పబ్ యజమానులు ఉదయం వరకు సంగీతాన్ని మోగిస్తూనే ఉంటారు. అయితే, సరైన రవాణా సదుపాయం ఏదీ లేకుండా గోవాలో రాత్రి పొద్దు పోయేటంత వరకు కొనసాగటం రిస్కుతో కూడినదే. మీకు క్యాబ్ దొరకటం కష్టం కావచ్చు.

ఉత్తర గోవాలో కేఫే టిటోస్ మరియు మాంబోస్ అనేవి రెండు ప్రఖ్యాత నైట్ క్లబ్బులు. ఇవి కాలాగుటే బీచ్ కు దగ్గరగా ఉంటాయి. వీటినుండి కొంచెం ముందుకు వెళితే, రోడ్ సైడ్ పబ్ లు, బార్లు చవక ధరలలో ఆహారాన్ని, ఆల్కహాల్ ని అందిస్తూ అందరికి ఇష్టమైన సంగీతాలను సైతం అందిస్తాయి. సాంప్రదాయ నైట్ క్లబ్బులే కాక, ఇక్కడి కొన్ని బీచ్ గుడిసెలు పార్టీలను సైతం ఏర్పరుస్తాయి. అయితే, బీచ్ లో బాగా లోపలికి వెళ్ళటం రాత్రిపూట సూచించదగినది కాదు. పోలీసులు, సముద్రపు అలలు వంటివి ఇబ్బంది పెడతాయి. పాంజిం ప్రాంతం చాలా బిజీగా ఉంటుంది. షాపింగ్ బాగానే ఉంటుంది. కాని లభించే ఆహారాలు రుచిగా ఉండవు.

goa,fascinating,vacation,spot,travel ,ఆకర్షణీయ , విహార, స్ధలం, గోవా, పర్యాటకులను


దేశంలో గోవా ఒక పర్యాటక స్ధలంగా వయసుతో నిమిత్తం లేకుండా సెలవులు గడిపేందుకు అన్ని ప్రదేశాలనుండి రవాణా సదుపాయం కలిగి ఉంది. ఇక్కడి నైట్ లైఫ్, బీచ్ లు, పార్టీలు అన్ని కూడా దేశంలోని ఇతర నగరాల కంటే కూడా తక్కువ ఖర్చులోనే అందిస్తూ దేశీయ పర్యాటకులను మరల మరల స్వాగతిస్తాయి. ఈ ప్రదేశంలో కల విశ్రాంతి, అయోమయంగా తిరిగే చిన్న చిన్న గల్లీల వంటివి భారతీయ స్పర్శతో మీకు ఆనందాన్ని తప్పక ఇస్తాయి.

సెలవుల కొరకు ఈ ప్రాంతానికి వచ్చే విదేశీయులు సైతం భారతీయ జీవన విధానాలను ఆనందిస్తారు. మీరు కనుక కొద్దిపాటి సాహసం చేయాలనుకునేవారైతే, అక్కడే వున్న ఒక గుడిసెను అద్దికు తీసుకోండి. ఇక అక్కడి స్ధానిక జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి. ఈ రకంగా చెప్పాలంటే, గోవా గురించి ఎంతో ఉంటుంది. టీనేజ్ లో వున్నవాళ్లు ఎక్కువగా ఇషపడి ప్రయాణించే పర్యాటక స్థలాల్లో గోవా ప్రసిద్ధిగాంచింది.

Tags :
|
|

Advertisement