Advertisement

విహారం...వినోదం, విజ్ఞానం, విలాసం

By: chandrasekar Sat, 18 July 2020 10:51 AM

విహారం...వినోదం, విజ్ఞానం, విలాసం


విహారం కొంతమందికి వినోదంగా, మరికొందరికి విజ్ఞానంగా, ఇంకొందరికి విలాసంగా, ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా విహారం ఒక అనుభవసారం. ఆధునిక వాహనాలు లేని కాలంలో విహారం వ్యయప్రయాసలతో కూడుకుని ఉండేది. ఎంతో అవసరమైతే తప్ప యాత్రలకు, పర్యటనలకు బయలుదేరే జనాలు అరుదుగా ఉండేవారు.

excursion,entertainment,knowledge,luxury,trip ,విహారం, వినోదం, విజ్ఞానం, విలాసం,  అరుదుగా


మోటారు వాహనాలు, రైలుబళ్లు, ఓడలు, విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ప్రయోజనాల కోసం మనుషులు పర్యటనలు చేయడం పెరిగింది. క్రమంగా పర్యాటకం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది. చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు స్థాయికి ఎదిగింది. కొన్ని దేశాలైతే కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి.

ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, కొండలు కోనలతో చూడచక్కని ప్రకృతి పరిసరాలు, అద్భుతమైన సముద్ర తీరాలు వంటి ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు సందర్శించుకునే ప్రదేశాలు చాలా ఉన్నాయి.

excursion,entertainment,knowledge,luxury,trip ,విహారం, వినోదం, విజ్ఞానం, విలాసం,  అరుదుగా


భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువమంది ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను తప్పనిసరిగా సందర్శించుకుంటున్నారు. ప్రపంచంలోని ఏడువింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను చూడటమే లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు కూడా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. తాజ్‌మహల్‌ చూడటానికి వచ్చే పర్యాటకులు ఆగ్రాలోను, చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించుకుని వెళుతున్నారు. ఆగ్రాలోను, ఆగ్రా పరిసరాల్లోని ఆగ్రా కోట, మొఘల్‌ గార్డెన్స్, జమా మసీదు, మోతీ మసీదు, సికింద్రా కోట, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ప్రదేశాలకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.

excursion,entertainment,knowledge,luxury,trip ,విహారం, వినోదం, విజ్ఞానం, విలాసం,  అరుదుగా


ఆగ్రా తర్వాత భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల తాకిడి ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీని చూడటానికి విదేశీయులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడి చారిత్రక కట్టడాలైన ఇండియా గేట్, ఎర్రకోట, కుతుబ్‌ మీనార్, లోటస్‌ టెంపుల్, అక్షర్‌ధామ్, రాష్ట్రపతి భవన్, పురానా ఖిల్లా వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ ఎన్నికలను తిలకించడానికి ప్రత్యేకంగా వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య గడచిన పదేళ్లలో బాగా పెరిగింది. ఎన్నికల సమయంలో భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు ముఖ్యంగా ఢిల్లీలోనే మకాం వేసి, ఇక్కడి ఎన్నికల తతంగాన్ని పరిశీలించడానికి ఆసక్తి చూపుతుంటారు.

Tags :
|

Advertisement