Advertisement

కాలుష్యం లేని ప్రదేశం కోసం దక్కన్‌ ట్రేల్స్‌‌ పర్యాటక కేంద్రం

By: chandrasekar Thu, 09 July 2020 5:57 PM

కాలుష్యం లేని ప్రదేశం కోసం దక్కన్‌ ట్రేల్స్‌‌ పర్యాటక కేంద్రం


ఆహ్లాదం కోసం అడవుల్లో కనీసం ఊరవతలుండే కొండా కోనల్లోకో పోయి రావాలనిపిస్తోంది. అహ్లదం కోసం కాకపోయినా ఆక్సిజన్‌ కోసమైనా అప్పుడప్పుడు అడవుల అంచుల దాకైన వెళ్ళి రావాలి. అలాంటి వారి కోసమే కాకుండా వారి పిల్లా పాపల కోసం కూడా అందుబాటులో ఉన్నదే ‘దక్కన్‌ ట్రేల్స్‌ విహార కేంద్రం. అక్కడి ‘సాహస క్రీడల్లో పిల్లలు ఊగిపోతుంటే పెద్దలు పిల్లల నాటి ఊసులతో తేలిపోవాల్సిందే.

పచ్చటి పచ్చికల మీదుగా వీచే పైరగాలి విసురుకు యవ్వనం నాటి మధురానుభూతుల్లోకి మరోక్కసారి వెళ్లి రావాల్సిందే. ఇక వయస్సులో ఉన్న జంటలు ఊసులాడుకునేందుకు అనువైన చోటు. కాలుష్యం జాడలు కనిపించని ప్రశాంతమైన వాతావరణం. ప్రక్కనే ఉన్న కొండగట్టుకెళితే అక్కడో ‘ఫ్యూ పాయింట్‌. అక్కడి నుంచి చేస్తే కళ్ల ముందు దట్టమైన అడవుల కనువిందు. అక్కడ అడవుల్లోకి ట్రెక్కింగ్‌ చేయడం అదనపు ఆనంతం. ఉదయం, సాయంత్రం మాత్రమే ఇది అందుబాటులో ఉండే సదుపాయం.

మనం ట్రెక్కింగ్‌ చేస్తుంటే జింకలు, అడవి పందులు మన ముందు నుంచే పరుగులు తీస్తాయి. ఇక సీజన్‌లో పక్షుల కిలకిలలా రావాలు మన వీనులకు విందు చేస్తుంటే ఇతర అడవి ప్రాణుల సందడి మన మదిలో ఒక విధమైన అలజడి రేపుతాయి. ఇంతటి అనుభూతిని కలిగించే ప్రాంతం మరెక్కడో కాదు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్‌ ప్రాంతం. వాటి పక్కనే వికారాబాద్‌ రూట్‌ చేవెళ్లకు చేరువలో మన్నెగూడ పక్కనే ‘దక్కన్‌ ట్రేల్స్‌ పర్యాటక కేంద్రం ఉంది. అనంతగిరి హిల్స్‌ను కూడా దక్కన్‌ హిల్స్‌ అంటారు గనుక, వాటి పక్కనే ఉన్నందున దీనికి కూడా ‘దక్కన్‌ ట్రేల్స్‌ అని పేరు పెట్టి ఉంటారు.

అనంతగిరి అడవుల అందాలను ఆస్వాదించడం కోసమే పర్యాటక కేంద్రాన్ని అక్కడ అభివృద్ధి చేశారు. పిల్లలు, యువతీయువకుల కోసం అందులో రాక్‌ క్లైంబింగ్‌,బర్మా తాళ్ల వంతేన, టార్జాన్‌ స్వింగ్‌, స్వింగ్‌ స్పేడర్‌ వెబ్‌ సాహస క్రీడలు ఉన్నాయి. ఇంకా జంపింగ్‌ స్ప్రింగ్‌ నెట్‌, బాక్సింగ్‌ కిట్‌లు సరేసరి సైక్లింగ్‌ వాలీబాల్‌ మామూలే! అడవి వైపు అందమైన ‘వ్యూపాయింట్‌ ఉండగా ఇవతలి వైపు నలుగురు కూర్చునే చిట్టి గుడిశే మరో ఆకర్షణ. అక్కడ కూర్చుంటే కొండ వాలుగా వీచే పైర గాలులకు కొదవ లేదు. అక్కడి నుంచి సాయంత్రం సూర్యాస్తమి చంద్రోదయాన్ని ఏకకాలంలో చూడడం అద్భుతమైన అనూభూతి.

deccan trails is a tourist destination for a pollution free site ,కాలుష్యం లేని ప్రదేశం కోసం దక్కన్‌ ట్రేల్స్‌‌ పర్యాటక కేంద్రం


ఎంత ప్రకృతిలో ఐకమైనా సమయానికి అన్న పానీయాలు అందకపోతే అదో వెలితే. ఆ వెలితే ఉండకుండా ఎప్పటికపుడు మనకు అన్న పానీయాలు అందచేయడానికి పర్యాటక కేంద్రం సిబ్బంది సిద్దంగా ఉంటారు. సైనికుల్లాగ దుస్తులు ధరించే వారు సైనికుల వల్లే యుద్ధ ప్రాతిపదికపై పరుగులు తీస్తూ పనిచేయడం మనల్ని ఆకట్టుకుంటుంది. ఎలాంటి పర్యాటక ప్రాంతమైనా ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతం వసంత, హేమంత, శీతాకాలాల్లో ఎక్కువ బాగుంటుంది. మిగతా సీజన్లో అంతటి పచ్చతనం తప్ప ఆహ్లాదకరంగానే ఉంటుంది. చలికాచుకునేందుకు ‘నెగళ్ల ఏర్పాటు కూడా ఉంది.

అక్కడికి మాములు రోజుల్లో 50 మంది వరకు వస్తుంటే వీకెండ్‌లో సెలవు రోజుల్లో 120కి పైగా పర్యాటకులు వస్తున్నారట. అంత మందికే అక్కడ శాశ్వత ప్రాతిపదికపై వసతులు ఉన్నాయి. వారి కోసం మంచి గుడారాలు (టెంటు) అందుబాటులో ఉన్నాయి. గుడారాల భద్రతను దృష్టిలో పెట్టుకోని కామన్‌ డైనింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కోసం వసతి సదుపాయాలను పెంచుకుంటూపోతే ప్రశాంత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే నూతన సంవత్సరం లాంటి వేడుకల్లో భాగంగా ఎక్కువ మందికి ఆతిథ్యం ఇవ్వడం కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేస్తారట.

ఇంతగా చెబుతుంటే ఏ ఊటి కొడైకెనాల్‌ కూర్గ్‌లో ఊహించుకోవద్దు! అవి మనకు చాలా దూరంలో ఉన్న ఖరీదైన పర్యాటక కేంద్రాలు. ఒక్క హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణ ప్రాంతం మొత్తానికి అందుబాటులో ఉన్న పార్యటక ప్రాంతం ఇది. పై పెచ్చు దేని అందం దానిదే. పర్యాటక కేంద్రం నుంచి మరికొన్ని కిలోమీటర్లు వావహంలో ప్రయాణిస్తే నాగ సముద్రం కాలువ, నాలుగు వందల ఏళ్ల నాటి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చోడవచ్చు.

Tags :

Advertisement