Advertisement

శ్రీశైలం మల్లెల తీర్థంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి

By: chandrasekar Mon, 10 Aug 2020 9:20 PM

శ్రీశైలం మల్లెల తీర్థంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించే ఈ శ్రీశైలం పట్టణానికి లక్షలాది హిందువులు ప్రతి సంవత్సరం దేశం లోని అన్ని మూలల నుండి వచ్చి దర్శించుకుంటారు.

ఈ వూరిలో అనేక దేవాలయాలు, తీర్థాలు కలవు. భక్తులకు, పర్యాటకులకు కావలసిన వివిధ రకాల ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయి.

ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ ఉన్న మల్లెల తీర్థం అనే జలపాతంలో స్నానాలు ఆచరిస్తే చాలా మంచిది.

ఈ నీటి లోస్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు. శ్రీశైలం కు ఎయిర్ పోర్ట్ లేదా రైలు స్టేషన్ లేనప్పటికీ తేలికగా చేరగల చక్కటి రోడ్ మార్గం కలదు. ఇది ఒక ఉష్ణమండల ప్రదేశం కావున, వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి పర్యాటకులకు అసౌకర్యంగా వుంటుంది. శ్రీశైలం చూడాలంటే శీతాకాలం చాలా అనుకులంగా ఉంటాయి.

Tags :
|

Advertisement