Advertisement

ప్రకృతి అందాలకు ఆదిలాబాద్‌ అడవులు

By: chandrasekar Fri, 26 June 2020 7:52 PM

ప్రకృతి అందాలకు ఆదిలాబాద్‌ అడవులు


ప్రకృతి అందాలకు చూడాలంటె పోవలసిన స్థలం ఆదిలాబాద్‌ అడవులు. అక్కడ తొలకరి చినుకులతో ఆ కొండాకోనలు సరికొత్త శోభను సంతరించు కుంటున్నాయి. గలగలా పారే సెలయేళ్లు, చెంగుచెంగున పరుగులు తీసే వన్య ప్రాణులు, పక్షుల కిలకిలరావాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని కోక కట్టుకున్న తన ఒడిలో సేదతీరమంటూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నది. కుంటాల, మిట్టె జలపాతాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపును పొందాయి.

వీటిని సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తి చూపు తున్నారు. వీటితోపాటు నిర్మల్‌ సమీపంలోని శ్యాంగఢ్‌ కోట, నేరడిగొండ మండలంలోని కొర్టికల్‌ జలపాతం, ఉట్నూర్‌లోని గోండురాజుల కోట, జన్నారం మండలంలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌, శివ్వారంలోని మొసళ్ల సంరక్షణా కేంద్రం, కెరమెరి ఘాట్లు, సప్త గుండాల, బాబేఝరీ, గాయత్రీ జలపాతాలు, జోడెఘాట్‌ అందాలు పర్యాటకుల మనసుల్ని దోచేస్తున్నాయి.

adilabad,forests,for natural,beauty,travel ,ప్రకృతి, అందాలకు, ఆదిలాబాద్‌, అడవులు, మనసుల్ని


ట్రెక్కింగ్‌ను ఇష్టపడే సాహసికులకు ఈ ప్రాంతం కన్నుగీటి సవాలు విసురుతున్నది. ఆ పచ్చని ప్రకృతి మధ్య ఓ రాత్రంతా గడపాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక, ఆ నడకదార్లలో సైక్లింగ్‌ చేస్తుంటే.. స్వర్గంలో విహరిస్తున్న అనుభూతే! సింగరేణి సంస్థ మంద మర్రి ఏరియా డిప్యూటీ మేనేజర్‌ పీ శ్యాంసుందర్‌ ఈ మారుమూల పర్యాటక ప్రదేశాలకు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి తనవంతు కృషిచేస్తున్నారు.

ఆదిలాబాద్‌ అడవుల్లో నైట్‌ క్యాంపులు, సైక్లింగ్‌, ట్రెక్కింగ్‌లతోపాటు పలు సాహస యాత్రలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే గిరిజనుల సహకారంతో తక్కువ ధరకే వసతి, భోజనాలు సహా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు.

Tags :
|

Advertisement