Advertisement

  • ఒక అమ్మాయి మీతో ఇలా బిహేవ్ చేస్తే..ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే

ఒక అమ్మాయి మీతో ఇలా బిహేవ్ చేస్తే..ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే

By: Sankar Tue, 25 Aug 2020 10:13 AM

ఒక అమ్మాయి మీతో ఇలా బిహేవ్ చేస్తే..ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే


అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే తాను ప్రేమించిన ప్రేయసికి ఆ విషయాన్ని చెప్పేదాకా ఆగలేరు ..కానీ అమ్మాయిలు మాత్రం ఆలా కాదు ..తమ ప్రేమని తొందరగా బయటపెట్టరు.. సిగ్గు వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు.. కానీ వాళ్లు మాత్రం ప్రేమను మాటల రూపంలో ముందుగా వ్యక్తం చేయరు. తమంతట తాము లవ్ ప్రపోజ్ చేయకపోయినా.. వారి ప్రవర్తనను బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఇద్దరూ ఇప్పటికే మంచి మిత్రులైతే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోండిలా..

1. అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే.. తను మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటుంది. చేతులతో ముఖం తడుముకోవడం, జట్టుతో లేదా ఫోన్‌తో ఆడటం లాంటి పనులు చేస్తుంటుంది. మాటల మధ్యల గమనిస్తే.. ఈ విషయం మీకే తెలుస్తుంది.

2. మీరేదైనా చేస్తే మొదటగా తనే రెస్పాండ్ అవుతుంది. మీకు మందు తాగలనిపిస్తే.. ప్రైవసీ ఇవ్వడం కోసం తను నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది.

3. తనెందుకు హర్ట్ అయ్యిందో కూడా మీకు అర్థం కాదు. అంతగా హర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే తను మీ నుంచి ప్రేమను కోరుకుంటోంది. దాన్ని బయటపెట్టలేక అలా చేతల రూపంలో చూపుతుందన్న మాట.

4. మీరు ఊహించిన దాని కన్నా ఎక్కువగా తను మీకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. తను మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. తన గురించి ఆలోచించాలని కోరుకుంటుంది.

5. వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడ తను జలసీగా ఫీలవుతుంది. వేరే అమ్మాయితో మీరు క్లోజ్ మూవ్ అయితే ఇక అంతే. మీరు మాతో ఎందుకు ఉంటార్లేండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి టైం ఉండదు.. లాంటి పంచ్‌లు వేస్తుంటుంది.

6. మిగతా అమ్మాయిల కంటే కాస్త భిన్నంగా తను మిమ్మల్ని చూస్తుంది. తన కళ్లలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. మీరు వేరే వాళ్లతో మాట్లాడుతున్నా.. తన కళ్లు మాత్రం మిమ్మల్నే వెతుకుతుంటాయి.

7. మీరు గతంలో చెప్పిన ప్రతి మాటను తను గుర్తుంచుకుంటుంది. తన ఫోన్ ఎక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోయే అమ్మాయి.. ఫలానా రోజు మీరెం చెప్పారో కూడా గుర్తుంచుకుంటుంది.

8.బర్త్ డే రోజు తనే అందరి కంటే ముందుగా మిమ్మల్ని విష్ చేస్తుంది. రాత్రి 12 గంటలకు కావడానికి ముందే మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. తనకంటే ముందే ఎవరూ ఫోన్ చేయకుండా జాగ్రత్త పడుతుంది..


Tags :
|
|
|

Advertisement