Advertisement

  • అమ్మాయిలు ఇంప్రెస్స్ అవ్వాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాలి ..

అమ్మాయిలు ఇంప్రెస్స్ అవ్వాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాలి ..

By: Sankar Sun, 12 July 2020 9:02 PM

అమ్మాయిలు ఇంప్రెస్స్ అవ్వాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాలి ..



యుక్త వయసులో ఉన్న యువకులు అమ్మాయిలతో మాట్లాడాలని , వారిని ఇంప్రెస్స్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు ..అందుకోసం ఏవేవో చేస్తూ ఉంటారు ..కొంత మంది అయితే కాస్టలీ వస్తువులు , కాస్టలీ బట్టలు ఉంటేనే మాట్లాడతారు అని మరికొంతమంది అనుకుంటారు ..అయితే ఇవేమి లేకున్నా కూడా అబ్బాయిలతో కొన్ని లక్షణాలు ఉంటె అమ్మాయిలు వెంటనే ఇంప్రెస్స్ అవుతారు ..మరి ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం ...

1. ముందుగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం. సరదాగా మాట్లాడుతూ తనను నవ్వించగలగాలి. ఉన్నంతలోనే ఆకట్టుకునేలా మంచి దుస్తులు ధరించాలి.

2. పిచ్చోడిలా గడ్డం పెంచుకొని, గోర్లు పెరిగిపోయి, శరీరం నుంచి దుర్వాసన వస్తుంటే.. అలాంటి వ్యక్తికి ఏ అమ్మాయైనా దూరం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. చక్కగా ట్రిమ్ చేసి చూడగానే బావున్నాడనిపించుకోవాలి.

3. అమ్మాయితో మాట్లాడేటప్పుడు తనతో ఐ కాంటాక్ట్ ఉండేలా చేసుకోవాలి. ఫోన్లో ముఖం పెట్టి చూసుకోవడమో లేదంటే ఆమె వైపు తేడాగా చూడటమో చేస్తే మీ పని గోవిందా. కాబట్టి తనవైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడాలి.

4. మీరు తనతోనే కాకుండా వేరే వ్యక్తులతో ఎలా ఉంటున్నారనే విషయాన్ని అమ్మాయిలు నిశితంగా గమనిస్తారు.

5. మంచి చెప్పులు ధరించే విషయాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వేసుకున్న డ్రెస్ కంటే వారు వేసుకున్న చెప్పులనే ముందుగా గమనిస్తారు. ఫ్యాషన్ పేరిట బాబోయ్ అనిపించే టాటర్డ్ షాండల్స్, పాతబడిన స్పోర్ట్స్ షూ వేసుకొని తనని కలవడానికి వెళ్లే సాహసం చేయకండి. మీరు బద్దకస్తులని తను పొరబడే అవకాశం ఉంది.

Tags :
|
|

Advertisement