Advertisement

  • భార్యను లవ్ లెటర్ రాసి ఇంప్రెస్స్ చేయండి

భార్యను లవ్ లెటర్ రాసి ఇంప్రెస్స్ చేయండి

By: Sankar Tue, 02 June 2020 7:31 PM

భార్యను లవ్ లెటర్ రాసి ఇంప్రెస్స్ చేయండి

భర్త భార్యకు పెళ్ళి తర్వాత రకరకాల సందర్భాల్లో బహుమతులిస్తున్నా, లవ్ లెటర్స్ మాత్రం కరువైపోయాయి. బహుమతులు బానే ఉన్నా, లవ్ లెటర్స్‌లో ఉండే మజానే వేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భార్య ఆ లేఖని చదువుకుని ఆనందంగా ఫీల్ అవ్వొచ్చు. భర్త తనని ప్రేమిస్తాడని తెలియడం వేరు, ఆ ప్రేమని పొందికైన పదాల ద్వారా వ్యక్తపరచిన ప్రేమలేఖని అందుకోవటం వేరు. కాబట్టి ఈ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే భర్తకున్న ఏకైక మార్గం ప్రేమలేఖ రాసేయటమే. ఆ లేఖ అందుకున్న భార్యకి ఆనందమే కాదు, భర్తకి తనమీదున్న ప్రేమ మీద నమ్మకం కూడా బలపడుతుంది..

రేమలేఖ రాయడానికి భర్తేమీ పెద్ద కవి అవ్వాల్సిన అవసరం లేదు. తన ప్రేమని తనకు తెలిసిన పదాల్లో వ్యక్తపరిస్తే చాలు. మీకు తనంటే ఇష్టమని మీ భార్యకు తెలుసు. ఆ ఇష్టాన్ని మాటల్లో పెట్టడమే ఇప్పుడు కావాలి. పెళ్ళి తరువాత ప్రేమని బలంగా నిలబెట్టగలిగేది రొమాన్స్ మాత్రమే అని గుర్తుంచుకోండి. అంతే కాదు, మీ లేఖ ఎన్ని పేజీలుందో అనవసరం, అందులో మీరు వ్యక్తపరిచిన భావాలు ఎంత నిజమైనవో అవసరం. అందుకని, మీరేమనుకుంటున్నారో అదే రాయండి. ఈ విషయంలో టిప్స్ కావాలా.. మరింకెందుకు ఆలస్యం.. అవేంటో మీరూ తెలుసుకోండి..

wife,husband,love,letter,relation,strong , భర్త  , భార్య ,  ప్రేమ,  ప్రేమలేఖ, బహుమతులు

భార్యకి రాసే లెటర్‌లో ముందుగా ప్రియమైన అని రాసి భార్య పేరు రాయండి.. ఆ తర్వాత ఈ ఉత్తరం చూసి నువ్వు ఆశ్చర్యపోతావని నాకు తెలుసు. కానీ, నేనేమీ సరదాకి రాయలేదు. నీ వల్లే నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా చెప్పండి.. తనే మీ ఒంటరితనాన్ని దూరం చేసిందని కూడా చెప్పండి.. నీ ప్రేమే నన్ను నడిపిస్తోంది. నీ వలనే నాకొక కుటుంబం ఉంది. నువ్వు, పిల్లలు నా జీవితాన్ని పరిపూర్ణం చేశారు. మిమ్మల్ని చూడందే నాకు రోజు గడవదు. ఇలా రాయండి..

దీంతోపాటు..నాకు మనం కలిసిన మొదటిరోజు గుర్తొస్తోంది. ఆరోజు నీ ముఖాన్ని చూసి ఎలా ఇష్టపడ్డానో, ఇవాళ్టికీ అలాగే ఇష్టపతున్నాను. ఎందుకంటే మెరిసే నీ కళ్ళూ, చక్కటి నీ నవ్వూ నా హృదయాన్ని కరిగిస్తూనే ఉన్నాయి. కానీ, ఆ రోజు మాత్రం నీ నవ్వు చూసే నిర్ణయించుకున్నాను, ఈ నవ్వుతో నా జీవితం గడిపేయాలని. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతిరోజూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత చక్కటి జీవితాన్ని నాకిచ్చినందుకు నేనేమివ్వగలను తిరిగి, కృతజ్ఞతలు తప్పా.. ఇలా రాసి చివర్లో మీ పేరు రాయండి.. ఇవి మాత్రమే కాదు.. మీకు ఇంక మధుర జ్ఞాపకాలు ఉంటే వాటిని కూడా రాసేయొచ్చు.


Tags :
|
|
|

Advertisement