Advertisement

వేడివేడి కొర్రల ఉప్మా

By: chandrasekar Mon, 29 June 2020 7:06 PM

వేడివేడి కొర్రల ఉప్మా


మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతాము. అందుకు గాను బియ్యాన్ని ఎక్కువుగా పాలీష్ చేయటం వలన దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మన ఆహారంలో చేర్చుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు. ఎక్కువ శక్తి కలిగి ఉండటం వలన రైతులు పొలం పని చేసుకునేటప్పుడు తప్పకుండా కొర్ర అన్నాన్ని తింటారు. కొర్రలతో చాలా ఐటమ్స్ చేయవచ్చు. కొర్రలతో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు:
అండు కొర్రల రవ్వ - 3 కప్పులు
పచ్చి సెనగ పప్పు - ఒక టేబుల్‌ స్పూను
క్యారట్‌ తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు - పావు కప్పు
మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూను
ఉల్లి తరుగు - పావు కప్పు
అల్లం తురుము - ఒక టీ స్పూను
జీలకర్ర - ఒక టీ స్పూను
ఉప్పు - తగినంత
తరిగిన పచ్చి మిర్చి - 4
కరివేపాకు - 2
ఆవాలు - ఒక టీ స్పూను
నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం:

స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి నూనె వేయకుండా దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి తరుగు, క్యారట్‌ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి అంతే వేడివేడి అండు కొర్రల ఉప్మా రెడీ.

Tags :
|
|

Advertisement