Advertisement

టేస్టీ వెజిటబుల్ ఫింగర్స్

By: chandrasekar Mon, 10 Aug 2020 8:42 PM

టేస్టీ వెజిటబుల్ ఫింగర్స్


చికెన్‌తో ఫింగర్స్ లాగే వెజిటబుల్ ఫింగర్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇంట్లోనేసులువుగా చేసుకోవచ్చు. చికెన్‌తో ఫింగర్స్ చేయడానికి ఏ పదార్థాలు కావాలో తెలుసుకుందాము.

కావాల్సిన పదార్థాల

క్యారెట్ తరుగు - పావు కప్పు
మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
అరటికాయలు - 2
జీలకర్ర - అర టీస్పూను
కొత్తిమీర తరుగు - రెండు టీస్పూనులు
ఎండుద్రాక్ష - ఒక టీ స్పూను
జీడిపప్పు - అయిదు
గరం మసాలా - పావు టీ స్పూను
పచ్చిమిర్చి - రెండు
పనీర్ ముక్కలు - ఒక కప్పు
నిమ్మరసం - అరటీస్పూను
చాట్ మసాలా - చిటికెడు
కారం - చిటికెడు
నూనె - సరిపడా, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం:

అరటికాయల్ని, మొక్కజొన్న గింజల్ని కలిపి ఉడికించాలి. బాగా ఉడికాక వాటిని ముద్ద చేసి పెద్ద వెడల్పాటి పాత్రలో అరటి గుజ్జుని వేసి క్యారెట్ తరుగు, కొత్తి మీర తరుగు, జీలకర్ర, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసం, తరిగిన పనీర్ ముక్కలు, కారం, చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ ముద్దని మొదట గుండ్రంగా చేసుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనెని వేసి వేడి చేయాలి. అందులో వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి. టేస్టీ ఫింగర్స్ రెడీ.

Tags :
|

Advertisement