Advertisement

సూపర్ టేస్టీ ఐటెమ్ చనా మసాలా

By: chandrasekar Mon, 20 July 2020 12:39 PM

సూపర్ టేస్టీ ఐటెమ్ చనా మసాలా


రోటీ, పరోటా, చపాతీలలోకి మంచి రుచినిచ్చే కూర, శాఖాహార ప్రియులకు ఇష్టమైన వంటకం చనా మసాలా. రెస్టారెంట్లలో ఎక్కువగా అమ్ముడవుతున్న వంటకం. కానీ ఇప్పుడు అందరూ ఇంట్లో నే చేసేస్తున్నారు. ఈ వంటకం చేయడం అంత కష్టమేమీకాదు. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము.

కావాల్సిన పదార్థాలు

* కాబూలీ శెనగలు - రెండున్నర కప్పు

* అల్లం తరుగు - అర స్పూను

* వెల్లుల్లి తరుగు - రెండు టీస్పూనులు

* టమాట ముక్కలు - మూడు కప్పులు

* పచ్చిమిర్చి - నాలుగు

* పసుపు - ఒక టీస్పూను

* కారం - ఒక టీస్పూను

* గరం మసాలా - ఒక టీస్పూను

* కొత్తిమీర పొడి - రెండు టీస్పూనులు

* జీలకర్ర పొడి - రెండు టీస్పూనులు

* ఉల్లిపాయ - రెండు

* ఉప్పు - రుచికి తగినంత

* నూనె - సరిపడినంత


తయారుచేయు విధానం:



శెనగల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన నీళ్లు వంపేసి పక్కన పెట్టాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసి అందులో ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. అవి బాగా వేగాక టమోటా ముక్కల్ని, కొత్తిమీర పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలపాలి. వీటిని బాగా ఉడికించాలి. బాగా వేగితే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ముందుగా నానబెట్టిన కాబూలీ శెనగల్ని వేసి కలపాలి. రెండున్నర కప్పులు నీళ్లు కూడా వేయాలి. ఉప్పు వేసి, కాస్త కొత్తిమీర ఆకులు చల్లి మూత పెట్టేయాలి. ఓ పావుగంట సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పావుగంట ఉడికాక అందులో గరం మసాలా వేసి బాగా కలపాలి. మళ్లీ మూత పెట్టేసి చిన్న మంట మీద మూడు నిమిషాల పాటూ ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి బాగా కలపాలి. శెనగలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఉడకకపోతే మరికాసేపు చిన్నమంట మీద ఉడికించాలి. కావాలనుంటే పైన కొత్తిమీర మళ్లీ చల్లుకోవచ్చు.

Tags :
|
|
|
|

Advertisement