Advertisement

సమ్మర్ స్పెషల్ మామిడి పండు కుల్ఫీ

By: chandrasekar Mon, 03 Aug 2020 4:54 PM

సమ్మర్ స్పెషల్ మామిడి పండు కుల్ఫీ


అందరికి కుల్ఫీ ఐస్ అంటే చాలా ఇష్టం. అలాంటిది మామిడి పండుతో కుల్ఫీ ఐస్ తాయారు చేసి చూడండి బలేగా ఉంటుంది. వేసవిలో వచ్చే మామిడితో కుల్ఫీలను తయారు చేయడం ఎలాగో చూస్తాం.

తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు:

* పాలు - ఒక కప్పు లేదంటే కాస్త ఎక్కువ
* చిక్కగా మరిగించిన పాలు - పావు కప్పు
* మామిడి గుజ్జు - అరకప్పు
* చక్కెర - ఆరు స్పూనులు
* యాలకుల పొడి - పావు చెంచా
* మొక్కజొన్న పిండి - ఒక టీస్పూను

summer,special,mango,fruit,kulfi ,సమ్మర్ ,స్పెషల్, మామిడి, పండు, కుల్ఫీ


తాయారుచేయు విధానం:

ఓ గిన్నెలో పాలు, చక్కెర వేసి స్టవ్ మీద పెట్టాలి. వాటిని బాగా మరిగించాలి. మరిగి పాలు సగం అయిపోతాయి. అప్పుడు అందులో మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. అందులో చిక్కగా మరిగించిన పాలను కలపాలి. మంట తక్కువగా పెట్టి బాగా ఉడికించి కలుపుతూ ఉండాలి. ఓ అయిదు నిమిషాల పాటూ అలా మరిగించాక యాలకుల పొడి వేసి స్టవ్ కట్టేయాలి. ఈ పాల మిశ్రమాన్ని ఓ మిక్సిగిన్నెలో వేయాలి. అందులో కప్పు మామిడి గుజ్జు కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి కుల్ఫీ మౌల్డ్ లలో వేసుకుని డీప్ ఫ్రిజ్ లో అయిదు గంటలపాటూ ఉంచాలి. అంతే మామిడి కుల్ఫీ రెడీ. ఇది పిల్లలనుండి పెద్దల దాకా అందరూ ఇష్టపడి తింటారు.

Tags :
|
|
|

Advertisement