Advertisement

  • రెండే పదార్ధాలతో మృదువైన గులాబ్‌ జామున్ తయారు చేసే విధానం

రెండే పదార్ధాలతో మృదువైన గులాబ్‌ జామున్ తయారు చేసే విధానం

By: Sankar Tue, 02 June 2020 5:51 PM

రెండే పదార్ధాలతో మృదువైన గులాబ్‌ జామున్ తయారు చేసే విధానం

లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు సహా సామాన్యులు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు షేర్‌ చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే పదార్ధాలతో వైరైటీ వంటకాలు చేస్తూ నోరూరిస్తున్నారు. తాజాగా కేవలం రెండే రెండు ఇంగ్రీడియెంట్స్‌తో గులాబ్‌ జామూన్‌ తయారు చేశారు ఓ టిక్‌టాక్‌ యూజర్‌. ఖోయా, కండెన్సెడ్‌ మిల్క్‌, మిల్క్‌ పౌడర్‌ లేకుండానే మృదువైన గులాబ్‌ జామూన్లు లాగించేయ వచ్చని నిరూపించారు.

gulab jamun,bread,milk,smooth,sugar ,కండెన్సెడ్‌ మిల్క్‌, మిల్క్‌  పౌడర్‌, గులాబ్‌ జామూన్‌ ,  మృదువైన , చక్కెర

దీనికి కావాల్సిన పదార్ధాలు నాలుగు బ్రెడ్ ముక్కలు , 500 ఎం యల్ పాలు ..ముందుగా నాలుగు లేదా ఐదు బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకుని వాటిని ముక్కలు ముక్కలుగా చేయండి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసి.. మృదువైన బ్యాటర్‌ వచ్చేంత వరకు కలపండి. బాదం పప్పు తురుమును మధ్యలో వేసి ఆ మిశ్రమాన్ని గుండ్రటి ఉండల్లా చుట్టండి. వాటిని నూనెలో వేయించి పక్కకు పెట్టి.. ఆ తర్వాత చక్కెర పాకంలో వేయండి. అంతే టేస్టీ టేస్టీ గులాబ్‌ జామూన్లను లొట్టలేసుకుంటూ తినేయండి.

Tags :
|
|
|

Advertisement