Advertisement

సింపుల్ గా రవ్వ కేసరి స్వీట్

By: chandrasekar Thu, 25 June 2020 7:29 PM

సింపుల్ గా రవ్వ కేసరి స్వీట్


సింపుల్ గా తయారుచేసే స్వీట్ లలో రవ్వ కేసరి చాల ముఖ్యమైనది. ప్రతి పండగలోను అందరూ చాల ఈజీగా తయారుచేసి సర్వ్ చేసే స్వీట్. దీనిని పిల్లలు మరియు పెద్దలు చాల ఇష్ట పది తింటారు. మిఠాయిలు జాబితాలో చూసినట్లయితే అత్యంత ఇష్టమైన డిషెస్ లో ఒకటి రవ్వ కేసరి.

కావలసిన పదార్థాలు:
రవ్వ: 1 కప్
చక్కర: 1 కప్
నెయ్యి: 1/2 కప్
పాలు: 1/2 కప్
ఎండు ద్రాక్ష: కావలసినన్ని
నీళ్ళు: 2 1/2 కప్
జీడిపప్పు: కొన్ని
యాలకులు పొడి: చిటికెడు

తాయారు చేయు విధానం:

కడాయిని తీసుకోని అందులో రవ్వని వేసుకోవాలి మంటని మీడియంలో పెట్టి 2 నుంచి 3 నిముషాల వరుకు వేయించండి. లేదా రంగు మారేంత వరుకు వేయించుకోండి. ఇప్పుడు పాలను పోసుకొని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం ఉడికి దగ్గరపడ్డాక కావలసినంత పాలు, పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి.

మిశ్రమం గడ్డలు కట్టకుండా చూసుకోవాలి. చివరిగా ఎండు ద్రాక్షలు, జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏలకుల పొడిని వేసి కలుపుకొని సర్వ్ చేయండి.

Tags :
|
|
|

Advertisement