Advertisement

రాగి వడ

By: chandrasekar Thu, 25 June 2020 6:55 PM

రాగి వడ


రాగి చాలా ముఖ్యమైన పోషక విలువ‌లను కలిగివుంది, కార్బోహైడ్రేట్లు, ఫైబర్స్, కొవ్వులు మరియు ప్రోటీన్లు, కీ సూక్ష్మపోషకాల యొక్క ముఖ్యమైన స్థాయిలతో పాటు - విటమిన్లు మరియు ఖనిజాలు రాగిలో వున్నాయి. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది కొలెస్ట్రాల్ మరియు సోడియం యొక్క అతితక్కువ స్థాయిని కలిగి ఉంది. రాగిలో రోగనిరోధక, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి విటమిన్లు సి మరియు ఇ గణనీయమైన పరిమాణంలో ఉంటాయి.

ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లు - థియామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ మరియు ఫోలిక్ యాసిడ్ అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ కూడా రాగి పిండిలో పుష్కలంగా లభిస్తాయి, ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం తృణధాన్యాలు మరియు సూపర్ ఫుడ్ గా రాగిని చెప్పబడినది. ఈ రాగిని వుపయోగించి రుచికరమైన రాగి వడ ఎలా తాయారు చేయాలో చూస్తాం.

రాగిలోని పోషక విలువలు - వంద గ్రాముల పదార్థంలో:

ప్రొటీన్లు : 4.23 గ్రా
కొవ్వు : 54.41 గ్రా
పీచు పదార్థం : 1.4 గ్రా
పిండి పదార్థం : 23.37 గ్రా
శక్తి : 597.92 కి.కాలరీస్‌
క్యాల్షియం : 96.85 మి.గ్రా
ఇనుము : 0.79 మి.గ్రా

రాగి వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :

రాగి పిండి : 80 గ్రా
నానపెట్టిన శనగలు: 35 గ్రా
కారం పొడి : 5గ్రా
ఉప్పు : రుచికి సరిపడా
ఉల్లిపాయలు : 10 గ్రా
పచ్చిమిర్చి : 5 గ్రా
అల్లం : 10 గ్రా
గరం మసాల పొడి : చిటికెడు
కరివేపాకు : 5 గ్రా
కొత్తిమీర : 5 గ్రా
పుదీనా : 10 గ్రా
జీలకర్ర : 5 గ్రా
నూనె : 200 గ్రా

తయారు చేయు విధానం:

నానబెట్టిన శనగపప్పును మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన సన్నగా తరిగి ఉంచుకోవాలి. తరువాత రాగి పిండిలో తరిగిన ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని కొంచెం తీసుకొని వడల్లాగా వత్తి నూనెలో ఎర్రగా వేయించాలి. అంతే రాగి వడ రెడీ.


Tags :
|
|
|
|

Advertisement