Advertisement

పంజాబీ దమ్ ఆలూ

By: chandrasekar Wed, 03 June 2020 6:39 PM

పంజాబీ దమ్ ఆలూ


పంజాబీ దమ్ ఆలూ వంటకం ప్రపంచంలోనే నోరూరించే పంజాబీ ఆహార స్టైల్ నుంచి వచ్చింది. ఇది సులభంగా వండుకోగలిగే వంటకం,పైగా ఆఖరున నోరూరించే కూర తయారైనప్పుడు మనకి ఇంకా ఇంకా తినాలనిపించే వంటకం కాబట్టి పంజాబీ ఆలూ ఎన్నటికీ బోర్ కొట్టదు. దమ్ ఆలూగా కూడా పిలిచే ఈ వంటకం చక్కగా ఉడికిన, మసాలా దినుసులన్నీ కూరబడిన ఆలూ, ఇంకా కస్తూరి మెంతులు, జీలకర్ర, జీడిపప్పు,ఏలకులు, దాల్చిన చెక్క, ఇతర భారతీయ దినుసులన్నీ వేసి నోరూరించే కూరల అద్భుతమైన కాంబినేషన్. పంజాబీ ఆహారంలోనే ముఖ్య వంటకమైన పంజాబీ ఆలూ రెసిపి భారతీయ ప్రసిద్ధ వంటకంగా ప్రపంచంలో పేరు తెచ్చుకుంది. దీన్ని మీరు దాదాపు ఏ పెళ్ళిలోనైనా ,ఇతర ఫంక్షన్లలోనైనా చూడవచ్చు. ఈ రుచికరమైన పంజాబీ దమ్ ఆలూ రెసిపిని తాయారు చేయడానికి:

కావలసిన పదార్థాలు

* చిన్న బంగాళదుంపలు - 15-18

* కొత్తిమీర -చేతికి పట్టినన్ని

* టమాటా ప్యూరీ -3/4 కప్పు

* పెరుగు - 3/4కప్పు

* నూనె - 5చెంచాలు

* ఉల్లిపాయ -1 కప్పు

* అల్లం-వెల్లుల్లి పేస్టు -1 చెంచా

* జీలకర్ర -1 చెంచా

* జీడిపప్పు -6-7

* దాల్చినచెక్క -1 ముక్క

* ఏలకులు-1

* లవంగాలు-1

* ధనియాలు -1చెంచా

* కస్తూరి మెంతులు -1 చెంచా

* పంచదార -1 చెంచా

* కారం -1 చెంచా

* ఉప్పు-1 చెంచా

* ఇంగువ-1 చెంచా

* బిర్యానీ ఆకు -1

* పసుపు -1 చెంచా


punjabi,dum,aloo,gravy,chapathi ,పంజాబీ, దమ్, ఆలూ, వంటకం, కాబట్టి


తయారుచేసే విధానం:

మిక్సీ జార్ లో ధనియాలు, దినుసులు, జీడిపప్పు, జీలకర్ర అన్నీవేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టండి. కుక్కర్ తీసుకుని నీళ్ళు పోసి, బంగాళదుంపలు వేయండి. బంగాళదుంపలు మెత్తగా అయ్యేవరకు కుక్కర్ లో ఉడికించండి. బంగాళదుంపల తొక్కు తీసేసి, ఫోర్క్ తో ఆలూలలో గుచ్చండి. దానివలన దినుసులు లోపలి వరకూ వెళ్తాయని ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక పెనం తీసుకుని, నూనె వేసి, బంగాళదుంపల పైపొర గోధుమరంగులోకి మారేదాకా వేయించండి. ఇంకో పెనం తీసుకుని, నూనె,బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిముక్కలు లేత బ్రౌన్ రంగులోకి మారేదాకా కలపండి. టమాటా ప్యూరీని వేసి మళ్ళీ కలపండి.

ప్యూరీ గట్టిపడుతుంటే, మసాలా దినుసుల మిశ్రమాన్ని వేసి ఆపకుండా కలుపుతూ ఉండండి. పెరుగు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి. పసుపు, పంచదార వేసి 2-3నిమిషాలు కలిపి నీళ్ళు ఆఖరిలో పోయండి. కస్తూరి మెంతులు వేసి ఒక నిమిషం కలపండి. మూతలు ఉంచి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి, కూర గట్టిపడుతూ, అన్ని దినుసుల వాసన మీకు తెలుస్తుంది. బంగాళదుంపలను ఈ కూరలో వేసి బాగా కలపండి. బంగాళదుంపలు కూరలో వేసి ఉడికించాక, దమ్ ఆలూను బౌల్ లోకి తీయండి. ఇక దీన్ని కొత్తిమీరతో పైన అలంకరించి చపాతీ లేదా పూరీకి పక్కన వంటకంలా వడ్డించండి.

Tags :
|
|
|

Advertisement