Advertisement

ఆరోగ్యకరమైన బీట్ రూట్ హల్వా తయారీ

By: chandrasekar Wed, 01 July 2020 4:36 PM

ఆరోగ్యకరమైన బీట్ రూట్ హల్వా తయారీ


ఆరోగ్యకరమైన దుంపకూరగాయల్లో బీట్‌రూట్‌ ఒకటి. ఇందులో ఎన్నో రకాలైన పోషకాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూరగా తీసుకునేందుకు చాలా మంది ఇష్టపడరు. ఇందులో ఉండే వగరు వల్ల చిన్నపిల్లలు తినడానికి ముందుకు రారు. కానీ పోషకాల బీట్‌రూట్ పిల్లలు సైతం మెచ్చేలే ఓ వంటను తయారు చేసుకోవచ్చు. బీట్‌ రూట్‌తో హల్వా చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. రక్త హీనతతో బాధ పడేవారు బీటర్‌ రూట్ ను ఈ విధంగా తరుచూ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది. మరి యమ్మీ యమ్మీ బీట్‌ రూట్ హల్వా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలిసికుందాం.

కావాల్సిన పదార్ధాలు:

* బీట్‌రూట్‌
* నెయ్యి
* చెక్కెర
* జీడిపప్పు
* కిస్‌మిస్‌
* బాదం పప్పు
* యాలకుల పొడి

తయారుచేయు విధానం:

బీట్‌రూట్ శుభ్రంగా కడగాలి తరువాత దాని పై తొక్కుని తీయాలి. తరువాత దానిని సన్నగా తరుముకోవాలి. ఇప్పుడు ఈ తరుమును ఒక గిన్నెల పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నెయ్యి పోసుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కిస్‌మిస్‌ను కూడా వేసి వేయించాలి. వేగిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌లను పక్కన పెట్టుకోవాలి. మళ్లీ కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కాగాక బీట్‌రూట్ తురుమును అందులో వేసుకోవాలి.

దీని తయారీకి మీడియం ఫ్లే మ్‌లోనే హల్వాను తయారు చేసుకోవాలి. బీట్‌రూట్ తురుమును బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త నీటిని ఆడ్ చేసుకోవాలి. కావాలనుకునే వారు పాలను వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలపాలి ఇందులో చెక్కర వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకోవాలి. నీరంతా పోయేంత వరకు బీట్‌రూట్‌ తురుమును ఉడికించాలి. ఇప్పుడు ఇందులోనే యాలకూలను పొడి చేసుకుని దానిని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ ముక్కలను వేసి వీటిని బాగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి బీట్‌రూట్ హల్వా రెడీ.

Tags :
|

Advertisement