Advertisement

  • రుచికరమైన స్వీట్‌ కార్న్ ‌చికెన్‌ కట్లెట్ తయారీ

రుచికరమైన స్వీట్‌ కార్న్ ‌చికెన్‌ కట్లెట్ తయారీ

By: chandrasekar Sat, 27 June 2020 6:35 PM

రుచికరమైన స్వీట్‌ కార్న్ ‌చికెన్‌ కట్లెట్ తయారీ


మొక్కజొన్న కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్కజొన్న లో తీపి మొక్కజొన్న అదేనండీ మనకు తెలిసిన స్వీట్ కార్న్ ఎన్నో వ్యాధుల నుండి మనలని కాపాడుతుంది. మరి ఈ స్వీట్ కార్న్ వల్ల మానవుని ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు కలుగుతాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా తగ్గిస్తుంది. ఈ స్వీట్ కార్న్ తో చికెన్ కలిపి రుచికరమైన కట్లెట్ ను ఎలా తరుచెయ్యాలో చూస్తాం.

కావలసిన పదార్థాలు:

* చికెన్‌ – పావు కిలో(బోన్‌ లెస్‌ ముక్కలని మెత్తగా ఉడికించిపెట్టుకోవాలి)
* స్వీట్‌ కార్న్‌ – 1 కప్పు నిండుగ
* బంగాళ దుంప – 1 (ముక్కలు కోసి, మెత్తగా ఉడికించుకోవాలి)
* ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు
* పసుపు – పావు టీ స్పూన్
* కారం – 1 టీ స్పూన్‌
* జీలకర్ర పొడి – పావు టీ స్పూన్
* గరం మసాలా – అర టీ స్పూన్
* అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్
* ఉప్పు – తగినంత
* పాలు – 2 టేబుల్‌ స్పూన్లు
* మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు
* నీళ్లు – సరిపడా
* నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా తీసికోవాలి

తయారు చేయు విధానం:

ఒక బౌల్‌ తీసుకుని అందులో చికెన్, స్వీట్‌ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్సీ లో ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో పసుపు, కారం, జీలకర్రపొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన షేప్‌లో కట్లెట్స్‌ చేసుకుని ఒకసారి పాలలో ముంచి, మొక్కజొన్న పిండి పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము లేదా ఉల్లిపాయ ముక్కలు వంటివి గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. దీనిని పిల్లలు మరియు పెద్దలు చాల ఇష్టపడి తింటారు.

Tags :

Advertisement