Advertisement

రుచికరమైన జొన్న చాట్‌ తయారీ

By: chandrasekar Sat, 04 July 2020 6:01 PM

రుచికరమైన జొన్న చాట్‌ తయారీ


జొన్నలోని ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు తదితర సమస్యలను నివారిస్తుంది. ప్రొటీన్‌, ఇతర ఖనిజాలు అధికంగా ఉండటంతో వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. మొత్తంగా, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది. ఈ జొన్నలు ఉపయోగించి చాట్ ఎలా తాయారు చెయ్యాలో చూస్తాం.

కావలసిన పదార్థాలు:

* ఉడకబెట్టిన జొన్నలు : 1 కప్పు
* ఆలుగడ్డ : 1 - చిన్నచిన్న ముక్కలు
* పచ్చిమిర్చి : 1
* తురిమిన అల్లం : 1
* వేయించిన జీలకర్ర : 1 టీస్పూన్‌
* టమాట : 1
* ఎండు మిరపకాయలు : అర టీస్పూన్‌
* నల్లమిరియాల పొడి: తగినంత
* నల్ల ఉప్పు: తగినంత
* నిమ్మరసం : 2 టీ స్పూన్లు
* పసుపు: చిటికెడు
* కొన్ని పుదీనా ఆకులు

తాయారు చేయు విధానం:

జొన్న విత్తనాలను రాత్రి పూట శుభ్రం చేసి నానబెట్టాలి. ఉదయాన్నే మళ్లీ కడిగి కుక్కర్‌లో వేసి, 2-3 కప్పుల నీరు, చిటికెడు ఉప్పు, పసుపుతో రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత బయటకు తీయాలి. చల్లబడిన తర్వాత జొన్న విత్తనాలు మృదువుగా తయారవుతాయి. ఒక గిన్నెలో ఉడికించిన జొన్న విత్తనాలు, తరిగిన టమాట, ఆలుగడ్డ ముక్కలు, అల్లం పేస్ట్‌, మెత్తగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. కొద్దిసేపటి తర్వాత నిమ్మరసంతోపాటు అన్ని మసాలా దినుసులూ జోడించి చక్కగా కలపాలి. అనంతరం పుదీనా ఆకులతో అలంకరించుకోవాలి. నిమ్మరసం, మసాలాలు మీ అభిరుచిని బట్టి వేసుకోవచ్చు. రుచి కరమైన జొన్న చాట్ రెడీ.

Tags :
|
|

Advertisement