మామిడిపిందెలతో ఊరగాయలు
By: chandrasekar Tue, 07 July 2020 10:32 AM
వడగాడ్పులు వీస్తాయి
మామిడి కాయలు పెద్దవయ్యే వరకు ఊరుకోగలమా చెట్టు కింద రాలిన పిందెలను ఏరి ఏదో ఒకటి
చేసేయొద్దు పిందే కదా అని ఏరి పారేయద్దు అందులోనూ రుచి ఉంది తిని చూడండి మీకు
నచ్చి తీరుతుంది కావాలంటే ఈ పిందె మీద ఒట్ పిందె విందు చేసుకు తిందాం వేసవి
వస్తోందనే సమాచారాన్ని మామిడి కాయలు మోసుకొస్తాయి. ఆ సమాచారంతో పాటు
ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, మినరల్స్నూ తీసుకొస్తాయి. మండు వేసవి రాక ముందే
అందరినీ నోరూరించే మామిడి కాయల వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది∙ మామిడిలో పొటాషియం, మెగ్నీషియం
సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది, క్యాన్సర్
ప్రమాదాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిస్తుంది ∙మామిడిలో అధిక
మొత్తంలో ఉండే పెక్టిన్, పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను
తగ్గిస్తుంది. పెక్టిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంచుతుంది ∙బరువు
పెరగడానికి సహాయపడుతుంది ∙రక్త హీనతను తగ్గిస్తుంది ∙మామిడిలో ఐరన్ సమృద్ధిగా
ఉండటం వల్ల, గర్భధారణ సమయంలో గర్భిణీలకు అవసరమైన ఇనుము వీటి
ద్వారా పుష్కలంగా లభిస్తుంది ∙మొటిమల నివారణకు మామడి చక్కని ఔషధం. చర్మానికి అడ్డు
పడే రంధ్రాలు తెరుచుకోవటం వల్ల మొటిమలు ఏర్పడటాన్ని నివారిస్తుంది ∙వృద్ధాప్యాన్ని
నివారిస్తుంది
మామిడికాయలో ఉండే ఏ, సి
విటమిన్లు శరీరంలో అధికమొత్తం కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి సహాయం
చేస్తాయి ∙మామిడికాయలో అధికంగా ఉండే
విటమిన్ బి 6 మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తుంది రోగనిరోధక
శక్తి పెంచుతుంది. మామిడిలో అధిక పరిమాణంలో ఉండే బీటా కెరొటిన్ అనే కెరొటినాయిడ్
వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యానికి మామిడి చక్కని ఔషధం.
మామిడికాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే విటమిన్ ఏ లభిస్తుంది. తద్వారా రేచీకటి, కళ్లు
పొడిబారడం వంటి సమస్యలు దూరమై, కంటి చూపు మెరుగుపడుతుంది ∙పచ్చి మామిడికాయ రసంలో
నీళ్లు, కొంచెం
పంచదార కలిపి తాగితే శరీరం చల్లగా మారి, వేసవిలో వడదెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి
ఉపయోగపడుతుంది ∙సూర్యుని వేడి వల్ల మన శరీర వేడి తగ్గక పోతే, మూత్రవిసర్జన
ఆగి, మూత్రపిండాలు
విషపదార్థాలతో నిండే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి మామిడికాయ ఎంతో
ఉపయోగపడుతుంది.
వడు మాంగా
కావలసినవి: మామిడి
పిందెలు – రెండు కప్పులు; ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి
పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు. పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు
– అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు
– కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ముందుగా మామిడి
పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి
∙ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం
వల్ల నూనె అన్ని మామిడి పిందెలకు పడుతుంది)
తయారీ: ∙బాణలిలో కొద్దిగా
నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి
చల్లారాక, ఉప్పు, ఇంగువ
జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙పావు కప్పు నీళ్లను మరిగించి
చల్లార్చాక, పొడికి జత చేసి మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ∙ఈ
మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ∙రోజుకి మూడు
నాలుగుసార్ల చొప్పున అలా సుమారు మూడు రోజులు కలపాలి ∙మామిడిపిందెలు మెత్తగా అయ్యి
తినడానికి అనువుగా తయారవుతుంది.
కడు మాంగా అచార్
కావలసినవి: మామిడి
పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు
రెమ్మలు; పచ్చిమిర్చి
– 6; పసుపు
– పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం –
2 టీ
స్పూన్లు; ఉప్పు
– తగినంత; నూనె –
4
టేబుల్స్పూన్లు.
తయారీ: ∙మామిడిపిందెలను
శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా
తరిగి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
∙కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ∙పసుపు, కారం
కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు
వేసి మరిగించాలి ∙చివరగా మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి
∙మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక, గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙(ఇష్టపడేవారు
కొద్దిగా బెల్లం తురుమును ఎండబెట్టి కలుపుకోవచ్చు)
కన్ని మాంగా అచార్
కావలసినవి: మామిడి
పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ
– టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి).
తయారీ: ∙ముందుగా
మామిడిపిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి
పోయేవరకు ఆరబెట్టి, ముచికలు కట్ చేయాలి ∙తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి
మరిగించి చల్లార్చాలి ∙ఒక పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి
మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి
∙నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ∙ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ
పొడి జత చేసి బాగా కలపాలి ∙ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన
మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు
వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి.