Advertisement

ఈ వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టరాదు

By: Sankar Sat, 13 June 2020 8:35 PM

ఈ వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టరాదు


వేసవి కాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో అవన్నీ ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. ఫ్రిజ్‌లో ఉంచే వస్తువులు ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే, ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో ఏయే ఆహార పదార్థాలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

టమోటాను ఫ్రిజ్‌లో ఉంచితే దానిపై ఉండే పలచని పొర ముడతలు పడుతుంది. విటమిన్-సి తగ్గిపోతుంది. అంతేగాక రుచిని సైతం కోల్పోతుంది. కాబట్టి, టమోటాలను రూమ్ టెంపరేచర్‌లో ఉంచడమే ఉత్తమం.

చిల్లీ, టమోటా సాస్ బాటిళ్లను ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే ఫంగస్ ఏర్పడుతుంది. కాబట్టి.. వాటిని బయట ఉంచడమే ఉత్తమం లేకపోతే. సాస్ విషతుల్యం అవుతుంది. సాస్‌లను బయట ఉంచిన పాడవవ్వు. అందులో ఉండే వెనిగార్ సాస్‌ పాడవ్వకుండా రక్షిస్తుంది.

బంగాళ దుంపలను ఫ్రిజ్‌లో పెడితే వాటి తొక్కలోని తేమ ఆవిరవుతుంది. ఫలితంగా బంగాళదుంప గట్టిగా మారుతుంది. వాటిని సులభంగా కట్ చేయలేం. పైగా బంగాళదుంపలో ఉండే పిండి పదార్థం తేమను కోల్పోయి చప్పగా మారుతుంది. ఉడకడానికి చాలా సమయం పడుతుంది. బంగాళాదుంపలు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టండి. ఎండ తగలకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే ఎండలో ఉండే క్లోరోఫిల్ కంటెంట్ వల్ల బంగాళదుంప చేదుగా మారుతుంది.

కాఫీ బీన్ పౌడర్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో ఉండే తేమ కాఫీ పౌడర్‌ గట్టిగా మారుతుంది. రుచి కూడా కోల్పోతుంది. మీరు కాఫీ గింజలను నిల్వ చేయాలంనుకుంటే ఒక కంటైనర్లో పెట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచండి.

పుచ్చకాయలను గానీ, పుచ్చకాయ ముక్కలనుగానీ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అలా చేస్తే పుచ్చకాయ రుచి కోల్పోతుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సైతం తగ్గిపోతాయి.

అరటి పండ్లు కి 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. ఈ ఉష్ణోగ్రతల్లోనే అరటి పండ్లు మగ్గుతాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆ ప్రక్రియ ఆగిపోతుంది. వాటికి సరిపడని ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల వాటి తొక్క క్రమేనా నల్ల రంగులో మారుతుంది. కాబట్టి అరటి పండ్లను బయట వాతావరణంలో ఉండచడమే మంచిది.


Tags :
|
|

Advertisement