Advertisement

పోషకవిలువలు కలిగిన రాగి ఇడ్లీలు

By: chandrasekar Fri, 03 July 2020 8:06 PM

పోషకవిలువలు కలిగిన రాగి ఇడ్లీలు


రాగులు ఇతర ధాన్యాల కంటే అధికంగా బలం కలిగినటువంటిది. రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం మరియు ఒక మంచి ఆరోగ్య నిర్వహణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది. ఈ రాగులు వుపయోగించి ఇడ్లిలా తినడం వల్ల మంచి ఆరోగ్యంతో బాటు రుచిగా ఉంటుంది. దీనిని ఎలా తాయారు చేయాలో చూస్తాం.

100 గ్రాముల రాగిలోని పోషక విలువలు:

* ప్రొటీన్స్‌ : 11.47 గ్రాములు
* కొవ్వు : 1.32 గ్రాములు
* పీచు పదార్థం : 2.92 గ్రాములు
* పిండి పదార్థం : 68.9 గ్రాములు
* శక్తి : 266.12 కిలో క్యాలరీలు
* క్యాల్షియం : 237.2 మిల్లీ గ్రాములు
* ఇనుము : 3.88 మిల్లీ గ్రాములు

millets,idlis,with,nutritional,values ,పోషక, విలువలు, కలిగిన, రాగి, ఇడ్లీలు


కావలసిన పదార్థాలు:

* రాగి పిండి : 60 గ్రాములు
* మినప పిండి : 20 గ్రాములు
* ఉప్పు : చిటికెడు
* నీళ్ళు : కావలసినంత

తాయారు చేయు విధానం :

మినప్పప్పుని నానబెట్టి గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్లలో నీటిని జోడిస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. రాత్రి వరకు నాననివ్వాలి. తరువాత రోజు, ఇడ్లీ పాత్రలో ఇడ్లీల్లా పోసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే రాగి ఇడ్లి రెడీ.

Tags :
|
|

Advertisement