Advertisement

  • అమ్మకు ప్రేమతో .... మెగాస్టార్‌ చిరంజీవి చేపల ఫ్రై

అమ్మకు ప్రేమతో .... మెగాస్టార్‌ చిరంజీవి చేపల ఫ్రై

By: Dimple Mon, 10 Aug 2020 12:53 PM

అమ్మకు ప్రేమతో .... మెగాస్టార్‌ చిరంజీవి చేపల ఫ్రై

సినిమాల్లో తన నటన... డ్యాన్సులు, హావభావాలతో నవరసాలతో అభిమానులను ఆకట్టుకున్న చిరంజీవి తాజాగా తన చేతి వంటకంతో అమ్మమనసు గెలిచాడు. చాలాబాగుందనే అభినందనలు అందుకున్నాడు. కట్టెచేపలను... చింతకాయల తొక్కుతో... పసుపు ఉప్పు... మసాలా కారం, నూనెను కలిపి.. జిలకరచేర్చి పెనంపై డీప్‌ ఫ్రైచేసిన మెగాస్టార్‌ చేసిన వంటకం అదిరిపోయింది. ఇన్నాళ్లు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న చిరంజీవి ఇటీవల తన అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు.

తాజాగా చేపల ఫ్రైతో సంచలనం సృష్టించాడు. ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. చిరు కోడ‌లు ఉపాస‌న మెగాస్టార్ వంటకి ఫిదా అయిన‌ట్టు కామెంట్ పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

చేపల ఫ్రై చేసే విధి విధానాలను వివరిస్తూ... చక్కగా వీడియోను రూపొందించి తన వ్యక్తిగత ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు పెట్టాడు. అభిమానులు విపరీతంగా లైక్‌ చేస్తూ చిరంజీవి వంటకు ఫిదా అయ్యారు. మరికొందరు ఇదే తరహాలో చేపలఫ్రై చేసుకోవాలని మార్కెట్‌లో కట్టెచేపలకోసం ప్రయత్నించారు. చిరంజీవి చేసిన చేపలఫ్రై... హిట్టా ఫట్టా అనే విషయాన్ని అమ్మనుంచి తెలుసుకున్నతీరు అభిమానులను ఆకట్టుకుంది. అమ్మ ఆత్మీయంగా చేపల ఫ్రైతో వేడి వేడి అన్నాన్ని కలిపి నోట్లో పెట్టుకుని తిన్న కాసేపటి తర్వాత... చాలా బావుందనే... కాంప్లిమెంట్‌ ఇచ్చింది. దీంతో చిరంజీవి ఆనందంతో తబ్బిఉబ్బిపోయాడు.

Tags :
|
|
|
|
|
|

Advertisement