Advertisement

  • రుచికరమైన స్టఫ్డ్ అప్పడాలు తయారు చేద్దాం

రుచికరమైన స్టఫ్డ్ అప్పడాలు తయారు చేద్దాం

By: chandrasekar Fri, 07 Aug 2020 5:36 PM

రుచికరమైన స్టఫ్డ్ అప్పడాలు తయారు చేద్దాం

అప్పడాలు ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కొంతమంది భోజనం పెట్టగానే అందులో మొదట అప్పడమే తినేస్తారు. అలాంటి అప్పడంతో కూడా రోల్ చేసుకుని తినొచ్చు. వాటినే స్టప్ట్ అప్పడాలు అంటారు. స్టప్ట్ అప్పడాలు ఎలా చేయాలో తెలుసుకుందాము.

కావాల్సిన పదార్థాలు

అప్పడాలు - నాలుగు
ఉల్లిపాయలు - రెండు
బంగాళాదుంపలు - నాలుగు
టొమాటోలు - మూడు
చీజ్ - మూడు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
చాట్ మసాలా - చిటికెడు

తయారుచేసే విధానం:

అప్పడాలను సన్నని మంట మీద కాల్చాలి. అవి మరీ గట్టిపడకుండానే తీసేయాలి. అంటే కరకరలాడే విధంగా కాల్చకూడదన్న మాట. కొన్ని సెకన్ల పాటూ కాల్చేసి అవి వంగి పోకుండా అప్పడాల కర్రతో రోల్‌లా చుట్టేయాలి. ముందే బంగాళాదుంపలను ఉడికించి ముద్దలా చేసుకోవాలి. అందులో చీజ్ తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి ఉల్లి తరుగును బాగా వేయించాలి. ముందుగా రోల్ లా చుట్టుకున్న అప్పడంలో బంగాళాదుంప ముద్ద వేయాలి. దానిపై ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు వేసి పైన చాట్ మసాలా చల్లాలి. స్టఫ్డ్ అప్పడాలు రెడీ.

Tags :
|
|

Advertisement